- ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ) . . .

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాథినిత్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో గత ఏడాది కాలంగా తెలుగుదేశం - జనసేన మధ్య విభేదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ రెండు పార్టీల మధ్య పిఠాపురం వేదికగా గొడవలు బట్టబయలు అయ్యాయి. పిఠాపురం మార్కెట్ యార్డ్ చైర్మన్గా వాకపల్లి దేవి ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ సభలో ఘర్షణ జరగటం తీవ్ర చర్చలు అంశం అయింది. కూటమికి చెందిన టిడిపి - జనసేన మధ్య పిఠాపురంలో ఐక్యత లేదు. సాక్షాత్తు జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తారు అన్న ప్రకటన వచ్చిన రోజు నుంచి కూడా టిడిపికి .. జనసేనకు మధ్య ఏమాత్రం సంకేతం లేదు. పిఠాపురం తెలుగుదేశం ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే వర్మ ఉన్నారు. ఆయనకు సీటు ఇవ్వలేదు. అయితే చంద్రబాబు పార్టీ గెలిచిన వెంటనే ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న వర్మకు ఇప్పటివరకు పిఠాపురంలో ఎలాంటి ప్రాధాన్యత లేదు. దీంతో తెలుగుదేశం వర్గాలు రగిలిపోతున్నాయి.


ఇక పిఠాపురం మార్కెట్ గారి చైర్మన్ పదవి జనసేనకు చెందిన దళిత నాయకురాలు వాకపల్లి దేవికి దక్కింది. ప్రమాణ స్వీకారానికి టిడిపి నేతలను ఆహ్వానించారు. ఆమె ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఒక్కసారికి జనసేన నాయకులు జై జనసేన .. పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఇందుకు కౌంటర్గా టిడిపి నాయకులు చంద్రబాబు , వర్మ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. ఇది కాస్త పరస్పరం తోపులాటకు దారి తీసింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పిఠాపురం జనసేన ఇన్చార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ఎదుటే ఈ గొడవ జరిగింది. చివరకు పోలీసులు ఇరు వర్గాలను బయటికి పంపారు. దీనిని బట్టి పిఠాపురంలో రాజకీయం తెలుగుదేశం జనసేన మధ్య ఎలా నివురు గ‌ప్పిన నిప్పులా ఉందో అర్థమవుతుంది. ఈ వ్యవహారం ఇప్పుడు తెగే వరకు వెళ్ళింది. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ప్రాథినిత్యం వహించిన చోట ఇలాంటి రాజకీయ పరిస్థితులు నెలకొనటం.. ఇరు పార్టీలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: