టీటీడీ లడ్డూ వివాదం గతేడాది ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారనే ఆరోపణలు ఒకింత సంచలనం అయ్యాయి. అయితే సిట్ విచారణలో టీటీటీ లడ్డూ వివాదంలో ఊహించని ట్విస్టులు చోటు చేసుకున్నాయి. గత ప్రభుత్వ హయాంలో టీటీడీ లడ్డూ తయారీకి సరఫరా చేసింది అసలు నెయ్యే కాదని సిట్ హైకోర్టుకు నివేదిక ఇచ్చింది.
 
టీటీటీ ఏఆర్ డెయిరీ, వైష్ణవి డెయిరీలతో ఒప్పందం చేసుకున్నా తెర వెనుక నడిపించింది మాత్రం భోలే బాబా డెయిరీ అని తెలుస్తోంది. భోలేబాబా డెయిరీకి పాలు, నెయ్యి ఉత్పత్తి చేసే వ్యవస్థే లేదని సిట్ పేర్కొంది. తమ నుంచి పాలు సేకరించలేదని రైతులు చెప్పారని సిట్ తెలిపింది. భోలే బాబా డెయిరీ కేవలం పామాయిల్, కెమికల్స్, ముడి పదార్థాలు యూజ్ చేసి నకిలీ నెయ్యి తయారు చేశారని చెప్పుకొచ్చారు.
 
ముందుగా రచించిన ప్రణాళిక ప్రకారమే ఏఆర్ డెయిరీ, వైష్ణవి డెయిరీలను ముందు పెట్టి భోలే బాబా డెయిరీ వ్యవహారాన్ని నడిపిందని పేర్కొన్నారు. టీటీడీ భోలేబాబా డెయిరీని బ్లాక్ లిస్ట్ లో పెట్టిందని దీంతో ఆ డెయిరీ ఈ విధంగా కథ నడిపించిందని చెప్పుకొచ్చారు. ఈ కేసులో సాక్షిగా ఉన్న సంజయ్ జైన్ పై ఏప్రిల్ 7వ తేదీన పిటిషనర్లు, వారి తరపు వాళ్లు దాడి చేశారు
 
ఈ కేసులో నిందితుడిగా ఉన్న అశిష్ రోహిల్లాపై అతనికే తెలియకుండా హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పిటిషనర్లు ఆర్థికంగా బలవంతులని బెయిల్ ఇస్తే సాక్షులకు తీవ్ర ప్రమాదమని సిట్ అధికారులు చెబుతున్నారు. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేశారని సమాచారం అందుతోంది. ఈ కేసు రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
 

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: