ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తన మార్క్ పాలనతో ప్రజల నుంచి ప్రశంసలు పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. తాజాగా చంద్రబాబు నాయుడు ఏపీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించగా ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రభుత్వానికి పార్టీకి నష్టం కలిగిస్తే ఉపేక్షించనని చంద్రబాబు అన్నారు.
 
అలాంటి నేతలను వదులుకోవడానికి సిద్ధమంటూ చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. మీలో కొంతమంది ఎమ్మెల్యేలు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవాలి అని అనుకుంటే అది మీ ఇష్టం అంటూ చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల జాతకాలు తన దగ్గర ఉన్నాయని వాళ్ల పనితీరు వివారాల గురించి నివేదికలు సమాచారం తెప్పిస్తున్నానని అన్నారు. కొంతమంది నేతలు బాగానే పనిచేస్తున్నారని అయితే పనిచేయని నేతల విషయంలో అస్సలు ఉపేక్షించనని చంద్రబాబు కామెంట్ చేశారు. ఒకరిద్దరూ నేతల కొరకు పార్టీని ప్రభుత్వ ప్రయోజనాలను పణంగా పెట్టలేనని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
అతి త్వరలో ప్రతి ఎమ్మెల్యే తో ముఖాముఖి భేటీలు నిర్వహించి వల పనితీరు గురించి నివేదికలను వాళ్లకు వ్యక్తిగతంగా అందజేస్తామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అయిన నేపథ్యంలో నిన్న చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. పనిచేసిన వాళ్లకు గుర్తింపుతో పాటు మెరుగైన అవకాశాలు కూడా ఉంటాయని పనిచేయని నేతల విషయంలో 1995 నాటి విధానం అమలు కానుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
 
తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలు మరింత బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఇలాంటి ఎమ్మెల్యేలు కార్యకర్తలతో పాటు ప్రజలకు సైతం అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యేగా గెలిచాము కదా అని అతి విశ్వాసంతో వ్యవహరిస్తే మాత్రం వాళ్లకి ఎక్కువగా నష్టం జరుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు మనల్ని గమనిస్తూ ఉంటారని గత ప్రభుత్వ పాలనను భరించలేక ప్రజలు మనకు అవకాశం ఇచ్చారని ప్రజలు శాశ్వతంగా మనతోనే ఉండేలా చూసుకోవాలని చంద్రబాబు కామెంట్ చేశారు. తప్పు చేసిన నేతలను దూరం పెడతానని విమర్శలకు వివాదాలకు ఆరోపణలకు నేతలు దూరంగా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పేనని చంద్రబాబు చెప్పుకొచ్చారు


మరింత సమాచారం తెలుసుకోండి: