దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా ఆ ఎన్నికల్లో కొన్ని సమస్యలు తలెత్తడం సర్వసాధారణ విషయం. ఎందుకు అంటే మన దేశం చాలా పెద్దది. అలాగే అనేక మంది జనాభా ఉన్నారు. అలాగే ఓటు హక్కు కలిగిన జనాభా కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. దానితో అంత మందికి అన్ని సౌకర్యాలు కల్పించే విషయంలో ఎలక్షన్ల కమిషన్ కొన్ని సార్లు విమర్శలను కూడా ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే ఎలక్షన్ కమిషన్ మీద వస్తున్న విమర్శలను ఎదుర్కునేందుకు ఎలక్షన్ కమిషన్ రెండు కొత్త పద్ధతులను బీహార్ ఎన్నికలతో ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే... ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కొన్ని ఎలక్షన్ బూత్ లలో మాత్రమే సీసీ కెమెరాలు ఉండేవి.

చాలా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలు ఉండేవి కావు. ఆ విషయంలో కూడా ఎలక్షన్ కమిషన్ పై విమర్శలు చేసిన వారు ఉన్నారు. ఇకపోతే ఈ విమర్శలను అధిగమించేందుకు ఎలక్షన్ కమిషన్ కొత్త అడుగుతో ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సారి బీహార్ లో జరిగే ఎన్నికలలో 100% సీసీ కెమెరాలు ప్రతి పోలింగ్ బూత్ లో అమర్చబోతున్నట్లు ప్రతి పోలింగ్ బూత్ లో కూడా సీసీ కెమెరాల ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇక బీహార్ రాష్ట్రానికి సంబంధించిన జనాభాలో చాలా మంది ఇతర ప్రాంతాలలో నివసిస్తున్నారు.

అలాంటి వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే ఏర్పాట్లను ఎలక్షన్ కమిషన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఎక్కడ ఉన్నా వారైనా సరే తమ ఫోన్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అని తెలుస్తుంది. ఇకపోతే బీహార్ కు సంబంధించిన జనాభాలో దాదాపు 60 లక్షల నుండి 70 లక్షల వరకు సౌత్ లో నివసిస్తున్నట్లు, దేశ వ్యాప్తంగా కోటి వరకు నివసిస్తున్నట్లు తెలుస్తోంది. వారందరూ కూడా ఓటు హక్కును ప్రశాంతంగా వినియోగించుకోవాలని అందుకు ఈ సౌకర్యాన్ని ఎలక్షన్ కమిషన్ తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. దీని ద్వారా బీహార్ ఎన్నికలలో ఓటింగ్ పర్సంటేజ్ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: