ఆంధ్రప్రదేశ్లో అధికారం ప్రభుత్వానికి సంబంధించి కార్యకర్తల విషయంలో ఒక షాకింగ్ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఒక కేసు విషయంలో సీఐతో మాట్లాడడానికి వెళ్లిన ఒక మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆ మహిళ సోషల్ మీడియా వేదికగా ఏడుస్తూ ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. దీంతో ఈ విషయం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారుతోంది. ఆ మహిళ కూడా టిడిపి పార్టీకి సంబంధించిన మహిళ అన్నట్లుగా తెలుస్తోంది వాటి గురించి చూద్దాం.


అసలు విషయంలోకి వెళ్తే చిలకలూరిపేట సిఐ రమేష్ తనని చాలా అసభ్యకరమైన పదజాలంతో దూషించారు అంటూ టిడిపి మహిళా(శిరీష భాయి) నాయకురాలు ఆరోపణలు చేస్తున్నట్లుగా సూర్యకాంతం అనే ట్విట్టర్ నుంచి సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారుతోంది. ఈ వీడియోలో టిడిపి మహిళా మాట్లాడుతూ జూన్ 15న పోలీస్ స్టేషన్ కి వెళ్లిన మాట వాస్తవమే.. అయితే ఆ సమయంలో స్టేషన్లో ఉన్న 15 ఏళ్ల  అమ్మాయికి భరోసా కల్పించేందుకు తాను అక్కడికి వెళ్లానని..కానీ సిఐ తనను చాలా అసభ్యకరమైన పదజాలలతో దూషించారంటూ ఆ మహిళ ఆరోపించింది.. అంతేకాకుండా తన కులాన్ని కూడా ప్రస్తావిస్తే చాలా నీచంగా మాట్లాడారు అంటూ తెలియజేసింది.


సుమారుగా మూడు గంటలపాటు పోలీస్ స్టేషన్ లోనే నిర్బంధించారని.. ఇతర అధికారుల ముందు ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా ఆవేదనకు గురయ్యేలా చేస్తోందంటూ తెలుపుతోంది ఆ మహిళ.. మళ్లీ స్టేషన్ వైపు వస్తే కొట్టి కేసు నమోదు చేస్తానంటూ బెదిరించారని ఆ మహిళా టిడిపి  కార్యకర్త కన్నీరు పెట్టుకున్నారు. దీంతో టిడిపి మహిళ శిరీష భాయి తీవ్రమైన మనస్థాపానికి గురై ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసినట్లు తెలియజేసింది.. దీంతో పలువురు కార్యకర్తలు సైతం అధికార ప్రభుత్వమైన టిడిపి వాళ్లని ఇలా వేధిస్తుంటే ఇక సామాన్యల పరిస్థితి ఏంటి చంద్రబాబు అన్నట్లుగా ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వీడియో పైన ఎం చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: