- ( ఉత్త‌రాంధ్ర‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

విజయనగరం జిల్లా శృంగవరపుకోట రాజకీయం ఇప్పుడు రంజు గా సాగుతోంది. తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఆయన కోళ్ల‌ లలిత కుమార్ కి సొంత పార్టీలోనే పొగ పెడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. గత ఎన్నికలలో టిక్కెట్ ఆశించి చివరి నిమిషం లో తప్పుకున్న గొంప‌ కృష్ణ అనే ఎన్ఆర్ఐ కి ఇప్పుడు డీసీఎంఎస్ చైర్మన్ పదవి లభించింది. దీంతో ఆయన రాజకీయంగా దూకుడు పెంచారని అంటున్నారు. ఎమ్మెల్యే కోళ్ల వర్సెస్ గొంప‌ కృష్ణ అన్నట్టుగా తెలుగుదేశం రాజకీయం నడుస్తోంది. వైసీపీ నుంచి దూరం పాటిస్తూ వస్తున్న ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురామ ఎమ్మెల్యే లలిత కుమారిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు టిడిపి నుంచి పరోక్షంగా ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం సహకరిస్తుందని అంటున్నారు.


ఇలా ఎమ్మెల్యే ఒకేసారి ఇంటా బయట రాజకీయ సవాళ్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా ఎస్.కోట మండలం మీద పట్టు కోసం ఇందుకూరి ప్రయత్నాలు మొదలుపెట్టడం ఎమ్మెల్యే వర్గానికి నచ్చటం లేదు. ఏది ఏమైనా శృంగవరపుకోట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే ఇటు ఇంటి పోరుతో పాటు అటు వైసీపీకి దూరంగా ఉంటున్న ఎమ్మెల్సీ ఇందుకూరి రాజకీయాలతో తట్టుకోలేక పోతున్నారు అన్న ప్రచారం గట్టిగా నడుస్తోంది. అసలు గత ఎన్నికలలోనే ఆమెకు సీటు వస్తుందా రాదా అన్న సందేహాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు గెలిచాక యేడాదికే బాగా స‌త‌మ‌త మ‌వుతోన్న ప‌రిస్థితి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: