
టీడీపీ ప్రభుత్వం స్పందించింది - కనీసం రూ.8కి తగ్గకుండా కొనుగోలు చేయాలని ప్రకటించింది. సీఎం చంద్రబాబు వెంటనే కేంద్రానికి లేఖ రాసి సహాయం కోరారు. కేంద్ర మంత్రులు కూడా స్పందించారు. అప్పటికే 90% దిగుబడి అమ్మేశారు రైతులు ! చివరకు మిగిలింది 10% దిగుబడే . ఇప్పుడు దానిమిదే మీద జగన్ రాజకీయం మొదలెట్టారు. కానీ.. జగన్ వస్తున్నారన్న సంగతి తెలిసి కార్యకర్తల ర్యాలీలు పెద్ద ఎత్తున జరిగాయి. రైతుల కంటే ఎక్కువగా వైసీపీ కార్యకర్తలే హడావిడి చేశారు. లాఠీ చార్జ్ - కేసులు - జగన్ ప్లాన్ ఫ్లాప్ ? వాస్తవానికి రైతులకు మద్దతు పలకాల్సిన పర్యటన , పోలీసుల లాఠీ చార్జ్‌ల తో రణరంగంగా మారింది.
జగన్ లీడర్షిప్ తక్కువైందా? లేక ఆవేశంతో పథకం తప్పిందా అనేది ప్రశ్నగా మారింది. “జగన్ ఏమి సాధించాడు ?” అనే మాట ఇప్పుడు చిత్తూరు జనం నోట నిత్యం వినిపిస్తోంది. ఎస్పీ వార్నింగ్: కార్యకర్తల పై రౌడీ షీట్లు !? బంగారుపాళ్యం ఎస్పీ మణికంఠ మీడియా కు ప్రకటించిన ప్రకారం , వైసీపీ కార్యకర్తలు పోలీసుల పై దురుసుగా వ్యవహరించారని .. రౌడీ షీట్లు తెరుస్తామని చెప్పారు . అంటే జగన్ పర్యటన కు వచ్చిన కార్యకర్తలు ... ఇప్పుడు కేసుల్లో ఇరుక్కున్నారు. రైతుల సమస్యను రాజకీయ హంగామాగా మార్చిన జగన్ టీం.. చివరకు వారికే నష్టాలు తెచ్చింది. పబ్లిసిటీకి చేసిన పర్యటన... కేసుల రిజల్ట్ ఇచ్చింది.