
టేకాఆఫ్ ఆయన కేవలం కొద్ది సెకండ్లలోనే ఫ్యూయల్ సప్లై ఆగిపోవడంతో రెండు ఇంజన్లు కూడా పనిచేయకుండా ఉన్నాయని.. కానీ ఎందుకు ఫ్యూయల్ కట్ ఆఫ్ చేసావ్ అంటూ ఒక పైలట్ అడగగా తాను కట్ ఆఫ్ చేయలేదని రెండో ఫైలేట్ వెల్లడించారట.. కాక్ పిట్ ఆడియో రికార్డులో ఈ వాయిస్ ఉందని తెలిపారు. అయితే ఇంజన్ పవర్ ను కోల్పోగానే ఆటోమేటిక్గా హైడ్రాలిక్ పవర్ వచ్చేలా ర్యామ్ ఎయిర్ టర్బన్ కనెక్ట్ అయ్యి ఉంటుందని అందుకు సంబంధించి ఫుటేజ్ కూడా ఉన్నదంటూ తెలిపారు.
ఆ సమయంలో ఇంజన్లను రీస్టార్ట్ చేయడానికి పైలెట్లు కూడా ప్రయత్నించిన లాభం లేదని ఇంజన్ ఒకటి రికవరీ అయిన మరొక ఇంజన్ మొరాయించడంతో 32 సెకండ్లలోని కూలిపోయిందని తెలిపారు. విమానంలో ఫ్యూయల్ చాలా క్లీన్ గానే ఉన్నదని ఎటువంటి కలుషితమైన పదార్థాలు అందులో లేవన్నట్లుగా అథారిటీస్ ద్వారా తేలింది తెలిపారు. అయితే ఆ సమయంలో అక్కడ ఎలాంటి పక్షి కూడా ఎగరలేదని ఆకాశం కూడా చాలా క్లియర్ గా ఉందని వాతావరణ సమస్యలు కూడా ఏమీ లేవని తెలిపారు. విమానంలో మోతాదుకు మించి బరువులు కూడా ఏమీ లేవంటూ తెలిపారు. కుట్ర కోణానికి సంబంధించి ఆధారం ఏమీ లభించలేదని AAIB తెలిపారు. ఇంకా పూర్తిస్థాయి దర్యాప్తున చేయబోతున్నామని వెల్లడించారు.