ఒకప్పుడు ఆంధ్ర, తెలంగాణ  ఒకే రాష్ట్రం పరిధిలో ఉండేవి. ఆ తర్వాత  కేసీఆర్  తీసుకువచ్చిన టిఆర్ఎస్ పార్టీ ద్వారా ఉద్యమం చేసి ఎంతో మంది విద్యార్థుల ప్రాణత్యాగం  తర్వాత  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. అలాంటి ఈ తరుణంలో గత రెండు పర్యాయాలు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత మూడవసారి కాంగ్రెస్ అధికారంలో కూర్చుంది. ఈ క్రమంలోనే ఎలాగైనా ఈసారి స్థానిక మున్సిపాలిటీలు హైదరాబాదులో తమ పట్టు సాధించాలని టిఆర్ఎస్ శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. కానీ వారి మాటలను ప్రజలు ఎవరు కూడా నమ్మడం లేదని తెలుస్తోంది. టిఆర్ఎస్ మళ్లీ సెంటిమెంటు రాజేసే పని చేస్తోంది. సెంటిమెంట్ క్రియేట్ చేసి ప్రజలకు ఆయింట్మెంట్ పూస్తే నమ్మే పరిస్థితులు ఇప్పుడు లేవు.

 ఇప్పటివరకు తెలంగాణ, ఆంధ్ర అనే సెంటిమెంట్ పైనే బ్రతికినటువంటి బీఆర్ఎస్   మళ్లీ ప్రజల మధ్య చిచ్చులు పెట్టి సెంటిమెంట్ క్రియేట్ చేయాలని చూస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. ప్రస్తుతం ఆంధ్ర పత్రికల మీద పడ్డారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే టైంలో  తెలంగాణలో నివసించే ఆంధ్ర ప్రాంతాలను చాలావరకు టిఆర్ఎస్ పార్టీ వాళ్లు దూరం పెట్టారు. ఈ టైంలో ఆ ప్రాంతాల్లో టిడిపి, బిజెపి పార్టీలు విజయం సాధించాయి. ఆ తర్వాత ఆంధ్ర, తెలంగాణ వాళ్ళం అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని సెంటిమెంట్ క్రియేట్ చేసి హైదరాబాదులో 99మంది కార్పోరేటర్లు గెలిచారు. ఈ విధంగా వారి అవసరాలకు తగ్గట్టుగా సెంటిమెంట్ క్రియేట్ చేస్తూ ప్రజలను పిచ్చి వారిని చేస్తున్నారు.  

టిఆర్ఎస్ తెలంగాణ ఆంధ్ర అంటూ విడదీసి మాట్లాడినా ఆంధ్ర వ్యక్తులు మాత్రం బీఆర్ఎస్ ను ఎక్కువగా నమ్ముతున్నారు. దీనికి ఉదాహరణ కూకట్పల్లిలో విజయం సాధించడం. అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఓటమిలో ఉంది. ఎలాగైనా భవిష్యత్తులో మళ్లీ గెలవాలని ప్రాంతీయ సెంటిమెంట్ పై పడ్డారు. ప్రస్తుతం ఆంధ్ర, పత్రికలు తెలంగాణ వాళ్లు ఎందుకు చదవాలి అంటూ  ఒక సెంటిమెంట్ క్రియేట్ చేశారు. వారి పత్రికలను స్పెషల్ గా చదవాలని ఎవరు అడగలేదు. ముఖ్యంగా తెలంగాణలో నడుపుతున్న నమస్తే తెలంగాణ పత్రిక ఉంది. దాన్ని చదవమని చెబుతూ  ఆంధ్ర ప్రతీకలను దూరం చేయమని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు.

నిజానికి ప్రస్తుత పత్రికలు కేవలం ఆంధ్రాలో రకరకాల రాజకీయాలు చేస్తే తప్ప తెలంగాణ ప్రజల విషయంలో మాత్రం తప్పకుండా రిజర్వులోనే ఉంటాయి. ఈ విధంగా విషయాల్లో వేలుపెట్టిన బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం పత్రికల మీద పడింది. దీనిపై స్పందించిన రాజకీయ విశ్లేషకులు ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాల గురించి మాట్లాడాలి కానీ ఎప్పుడూ ఏదో ఒక సెంటిమెంట్ రగిలించి ప్రజలను పక్కదారి పట్టించడం మంచిది కాదంటూ మాట్లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: