
చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయనపై ఆశలు పెట్టుకున్నవారు ఎక్కువగా ఉన్నారు. హామీ ఇచ్చిన పథకాలలో కొన్ని పథకాలను త్వరితగతిన అమలు చేయాలని ప్రజలు ఎదురుచూస్తున్నారు. కానీ అంచనాలు తీరకపోతే అదే ప్రజల్లో నిరాశగా మారుతుంది. జగన్‌కు ఇది అవకాశంగా మారొచ్చు.
ఎన్నికల తర్వాత కూడా జగన్ ప్రజల్లోనే ఉన్నారు. పార్టీ కార్యకర్తలకు మానసికంగా అండగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అధికారం పోయిన తర్వాత అధినేతలు వెనక్కి తగ్గే సందర్భాలున్నాయి. కానీ జగన్ మాత్రం అదే స్పూర్తితో కొనసాగుతున్నారు. ఈ ప్రజల మధ్యలో ఉండే ప్రయత్నం వైఎస్సార్ కాలాన్ని గుర్తుచేస్తోంది.
తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు పార్టీల మధ్య ఇప్పుడే కొంత అభిప్రాయ భేదం కనిపిస్తోంది. ముఖ్యంగా పదవుల పంపకంలో అసంతృప్తి బయటపడుతోంది. జనసేన అనుచరుల్లో ఆక్రోశం పెరిగినట్టు సంకేతాలు వస్తున్నాయి. ఈ పరిస్థితులు జగన్ కు ప్లస్ అవుతున్నాయని చెప్పవచ్చు. గతంలో కన్నా శాంతమైన, ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్న జగన్ ఇప్పుడు దూకుడుగా స్పందించకపోయినా, ప్రజల సమస్యలపై గళం ఎత్తేలా మారుతున్నారు. ఇది 'విపక్ష నేత'గా ఆయనలో వచ్చిన పరిణతి అనిపిస్తోంది. ఆయన మాటల్లో తొందరపడే స్వభావం కంటే మౌలిక అంశాలపై దృష్టి పెడుతున్నట్టు కనిపిస్తోంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు