మనం ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు పక్క వారి అంగీకారం లేకుండా వారి మాటలను రికార్డ్ చేయడం అనేది చట్ట రీత్యా నేరం. అలా రికార్డు చేసినట్లయితే ఎవరి మాటలను అయితే పక్క వ్యక్తి రికార్డ్ చేశారో వారిపై లీగల్ గా యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇకపోతే తాజాగా ఓ కేసు విషయంలో మాత్రం పక్కవారి అనుమతి లేకుండా వారి మాటలను రికార్డు చేస్తున్న తప్పులేదు అని కోర్టు తీర్పు ఇచ్చింది. అసలు ఏం జరిగింది ..? అనే వివరాలను తెలుసుకుందాం.

కొంతకాలం క్రితం పంజాబ్ , హర్యానా హైకోర్టు భార్య వేధింపులను కోర్టులో నిరూపించాలి అంటే రహస్య ఫోన్ రికార్డింగ్ అనేది తప్పే కాదు అని తీర్పు ఇచ్చింది. పంజాబ్ కు చెందిన ఓ వ్యక్తి తన భార్య నుండి విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టుకు అప్లై చేశాడు. తన పట్ల భార్య ఎంతో క్రూరంగా ప్రవర్తిస్తుంది అని ఆయన ఆరోపించాడు. అందుకు సాక్షాధానాలుగా వారి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలను కోర్టుకు సమర్పించాడు. దీనిని పరిగణలోకి తీసుకున్న ఫ్యామిలీ కోర్టు విడాకులకు సంబంధించిన విచారణను ప్రారంభించింది. దీనితో ఆ మహిళ పంజాబ్ , హర్యానా హైకోర్టును ఆశ్రయించింది. తన అనుమతి లేకుండా తాను మాట్లాడిన మాటలను రహస్యంగా రికార్డు చేసిన వాటిని సాక్షాదారాలుగా కోర్టులో సమర్పించడం వాటిని సాక్షాలుగా పరిగణించినట్లయితే తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లు అని ఈమె వాదించింది. దానితో ఆమె అభ్యర్థనను అంగీకరించిన హైకోర్టు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన అభ్యర్థనను పక్కన పెట్టింది. దానితో ఆ భర్త ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దానితో సుప్రీంకోర్టు భార్య అనుమతి లేనిదే భర్త ఫోన్ రికార్డ్ చేయడం తప్పు అని కొంత మంది భావిస్తున్న అలా రికార్డు చేసే స్థాయికి వాళ్ళు వెళ్లారు అంటే వారి మధ్య బంధం ఎంత బీటలు బరిందో అర్థం అవుతుంది. వారిద్దరి మధ్య పరస్పర విశ్వాసం లేదు అని అర్థం అవుతుంది. దానితో ఆ సాక్షాధారాలను పరిగణలోకి తీసుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేస్తూ ట్రైల్ కోర్టు తమ విచారణను కొనసాగించవచ్చు అని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి: