కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే చాలా చిన్న వయసులో పెళ్లిళ్లు చేసుకునేవారు. ఇక పిల్లల తల్లిదండ్రులు కూడా అబ్బాయి సంపాదిస్తున్నాడా లేదా అనేది పెద్దగా చూడకుండా అమ్మాయిలను వారికి ఇచ్చేవారు. ఇక అబ్బాయిల తల్లిదండ్రులు కూడా వారు డబ్బు సంపాదిస్తున్నారా లేదా అనేది పెద్దగా ఆలోచించకుండా వారికి పెళ్లిళ్లు చేసేవారు. పెళ్లిళ్ల తర్వాత వారు ఏదో పని చేసుకొని బతకడం , మరి కష్టం అయితే విడిపోవడం జరిగేది. విడిపోవడం అనేది చాలా తక్కువ సందర్భాలలో జరుగుతూ ఉండేది. ఏదేమైనా కూడా 30 సంవత్సరాలు వచ్చే లోపు చాలా మంది పెళ్లిళ్లు చేసుకునేవారు.

30 దాటాక పెళ్లిళ్లు కానీ వారి సంఖ్య అత్యంత తక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు చాలా వరకు మారాయి. ఏ అబ్బాయికి అయినా పెళ్లి కావాలి అనుకుంటే కచ్చితంగా అతను ఏదో ఒక పని చేస్తూ వెల్ సెటిల్ అయ్యి ఉండాలి అని అలాంటి వారికే అమ్మాయిని ఇవ్వాలి అని అమ్మాయిల తల్లిదండ్రులు భావిస్తూ ఉండడం , అలాగే అబ్బాయి తల్లిదండ్రులు కూడా అబ్బాయి మంచిగా సెటిల్ అయ్యాకే అమ్మాయిని చూసి పెళ్లి చేస్తే వారి జీవితం ఎంతో బాగుంటుంది అని ఆలోచించడం చేస్తూ వస్తున్నారు. దానితో 30 దాటాక కూడా పెళ్లి కాని వారి సంఖ్య అత్యధికంగా ఉంటుంది. ప్రభుత్వం అమ్మాయిలకు పెళ్లిళ్ల వయసు కనిష్టంగా 18 సంవత్సరాలుగా నిర్ణయించగా , అబ్బాయిలకు 21 సంవత్సరాలుగా నిర్ణయించింది.

ఇక ఈ వయసులో మాత్రం పెళ్లిళ్లు కానీ వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కేవలం దేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సంఖ్య భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా పెళ్లిళ్లు కానీ వారి సంఖ్య చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉండడం పై కొంత మంది వెల్ సెటిల్ కావాలి అనే ఆలోచనలో అబ్బాయిలు , అమ్మాయిలు ఉండడం అలాగే వారి తల్లిదండ్రులు కూడా ఉండడంతో పెళ్లిళ్లు కాని వారి సంఖ్య చాలా పెరిగిపోతుంది అని కొంత మంది ఒక వాదనను వినిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: