
అయితే వైసీపీ నుంచి భవిష్యత్తులో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సరైన నేతలు లేరు. ఈ నియోజకవర్గంలో గెలవడం అసాధ్యమని కొందరు వైసీపీ నేతలు ఫిక్స్ అయ్యారని సమాచారం అందుతోంది. వైసీపీ ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గ నేతలకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాలు కూడా వైసీపీకి అంతగా ప్రయోజనం చేకూర్చలేదని తెలుస్తోంది.
వైసీపీకి పులివెందుల ఎలాగో టీడీపీకి హిందూపురం అలా అని ఈ నియోజకవర్గం కోసం ఎంత కష్టపడ్డా ఆ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరేనని విశ్లేషకులు భావిస్తున్నారు. కీలక నేతలైన నవీన్ నిశ్చల్, వేణుగోపాల్ రెడ్డిలను సస్పెండ్ చేయడం గురించి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతోంది. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు అస్సలు అంతు పట్టడం లేదని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది
హిందూపురం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో దీపిక పోటీ చేయగా ఆమె ఆశించిన ఫలితాలను సొంతం చేసుకోలేదు. ఎన్నికల ఫలితాల అనంతరం ఆమె పొలిటికల్ గా యాక్టివ్ గా లేరనే చెప్పాలి. హిందూపురం నియోజకవర్గ ప్రజలు సైతం బాలయ్య తన సొంత డబ్బులతో నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేశారని తమకు ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించి ఆ కష్టాలను తీర్చారని మరో 15 సంవత్సరాల పాటు బాలయ్యే తమ ఎమ్మెల్యేగా కొనసాగాలని అభిప్రాయపడ్డారు. టీడీపీకి అనుకూలంగా దశాబ్దాల తరబడి ఆశించిన ఫలితాలను అందుకుంటున్న ఈ నియోజకవర్గంలో భవిష్యత్తులో సైతం ఫలితం మారే ఛాన్స్ అయితే లేదని తెలుస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు