హైదరాబాదులో వర్షం కుండపోతగా పోస్తోంది. సుమారుగా  3 గంటల పాటు నాన్ స్టాప్ గా కురిసిన వర్షానికి నగరం మొత్తం కూడా చాలా నరకంగా మారిపోయింది. దీంతో ప్రజలు బయటికి రావాలంటే భయపడేలా కురిసింది వర్షం. ముఖ్యంగా నగరంలో ఎటు చూసినా కూడా నీరే ఉండడంతో నగరమంతా నీటిమయమయ్యింది. దీంతో రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి.  ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ తో నిండిపోయింది. జూబ్లీహిల్స్, ఎస్ ఆర్ నగర్, అమీర్ పేట్, పంజాగుట్ట మణికొండ ఇలా చాలా ప్రాంతాలలో కూడా భారీగానే వర్షం నమోదైనట్లుగా తెలుస్తోంది.


పలు ప్రాంతాలలో గాలులతో కూడిన వర్షం పడడంతో  తీవ్రంగా పంటలు కూడా నష్టపోయాయనే విధంగా వినిపిస్తోంది. రహదారుల పైన కూడా వర్షపు నీరు పారడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ భారీ వర్షాలు పడడంతో మాన్ సూన్ ఎమర్జెన్సీ బృందాలను కూడా ప్రభుత్వం రంగంలోకి దింపింది. ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని అవసరమైతేనే తప్ప మిగతా సమయాలలో ఇళ్ల నుంచి బయటికి రావద్దు అంటు సూచనలు ఇస్తున్నారు.



ప్రతి అధికారులు, నేతలు, మంత్రులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి పలు రకాల ఆదేశాలను జారీ చేశారు. ఎవరైనా ఏదైనా అత్యవసర పనులు, ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవాలంటూ తెలియజేస్తున్నారు. గచ్చిబౌలిలో అత్యధికంగా 12.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. శ్రీనగర్ కాలనీ అమీర్ పేట్ ప్రాంతాలలో 10 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదు అయినట్లుగా తెలుస్తోంది.


హైదరాబాద్ సరిహద్దు ప్రాంతాలలో విషయానికి వస్తే ఈ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో 154.0 మి.మీ వర్షపాతం నమోదయింది.. అతి తక్కువగా వనపర్తి శ్రీరంగాపురం మండలం జనంపేట లో 90. మి.మీ వర్షపాతం నమోదైనట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ అధికారులు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: