
ఫ్రీ బస్సు పథకం నాన్ స్టాప్ లకు, సూపర్ లగ్జరీ, ఏసి బస్సులకు, డీలక్స్ బస్సులకు వర్తించదు. ఇవి ఎక్కువగా జిల్లాల మధ్యలోనే తిరుగుతూ ఉంటాయి. ఉచిత బస్సు కోసం కేటాయించిన 8500 బస్సులలో సుమారుగా 6,500 బస్సులు ఇవే ఉన్నాయి. ఇవన్నీ కూడా జిల్లాల పరిధిలో తిరుగుతాయి తప్ప పక్క జిల్లాలకు పెద్దగా తిరగవు. సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో బస్సులు కేవలం నగర పరిధిలోనే తిరుగుతూ ఉంటాయి. ఒకవేళ ఇందులో ఉచితం అంటే నగర పరిధిలో మాత్రమే తిరగడం సాధ్యమవుతుంది. వీటి జాబితాలో 1500 ఎక్స్ప్రెస్ బస్సులను చేర్చారు. దీన్ని బట్టి చూస్తే ఆర్టీసీ బస్సు డిపో లెక్కల ప్రకారం ఒక్కో డిపో కి 5 నుంచి 6 బస్సులు మాత్రమే ఉంటాయి.
అంటే మహిళలు జిల్లాల పరిధిలోనే తిరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ అనంతపురం నుంచి అమరావతి వరకు వెళ్లాలి అంటే జిల్లాల జిల్లాలకు బస్సు మారుతూ వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా కాంట్రాక్ట్ బస్సులు, ఏసీ బస్సులను ఎక్కడానికి వీలు లేదు ఏ విధంగా చూసినా కూడా రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీ బస్సు పథకం అవుతుందనే విషయం చెప్పినప్పటికీ జిల్లాల పరిధిలోనే ఉండేలా నిబంధనలు రూపొందించినట్లు కనిపిస్తోంది. మరి మహిళల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.