రాయలసీమలోని అనంతపురం జిల్లాలో ఈరోజు ఉదయం నుంచి ధర్మారం ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయనే విషయం తెలియడంతో ఒక్కసారిగా అందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు. ధర్మవరంలో ఉండే లోనికోట కాలనీలో నూర్ అనే వ్యక్తిని NIA అధికారులు అరెస్టు చేయడం జరిగింది. ఉగ్రవాదులతో నూరు సంబంధాల పైన కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా అతని ఇంట్లో 20 సిమ్ కార్డులతో పాటు పలు రకాల కీలకమైన ఆధారాలు కూడా సేకరించినట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


ధర్మవరంలో ఒక హోటల్లో కుక్ గా పనిచేస్తున్న నూర్.. ఈ 20 సిమ్ కార్డులతో ఎవరెవరికి కాల్ చేశారనే విషయంపై అధికారులు ఇంకా ఆరా తీస్తున్నారు. అయితే అతడు ఉగ్రవాదులతో వాట్సాప్ కాల్ లో మాట్లాడినట్లుగా అనుమానిస్తున్నారు అధికారులు. ఈ సంఘటన ధర్మవరంలోని ప్రజలను మరింత భయభ్రాంతులకు గురిచేస్తోంది.NIA అధికారులు ఇందుకు సంబంధించి మరింత రహస్యంగా దర్యాప్తును చేపట్టాలని కొనసాగిస్తున్నారు. మొదటిసారిగా ధర్మవరంలో ఇలాంటి కేసులు నమోదు అవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ కేసులో మరింత సమాచారాన్ని ఇంకా అధికారులు తెలియజేయాల్సి ఉంది.


No india I love pakistan అంటూ వాట్సప్ స్టేటస్ పెట్టిన నూర్ ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు.. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఈ విషయం పైన నూర్ భార్య మాట్లాడుతూ తన భర్తతో ఆరు నెలల క్రితమే తాను విడిపోయానని ప్రస్తుతం పాఠశాలలో పనిచేసుకుంటున్నానని తమకు నలుగురు పిల్లలు ఉన్నారని తెలిపారు. తన భర్తకి ఉగ్రవాదులతో సంబంధం ఉన్నదో లేదో తెలియదని నాతో ఉన్నప్పుడు ఆయన ఎవరితో కూడా మాట్లాడలేదని విడిపోయాక ఏం జరిగిందో తెలియదు అంటూ వెల్లడించింది. ఈ విషయంపై నూర్ చెల్లెలు మాట్లాడుతూ .. పాలు తీసుకు వస్తానని చెప్పి మా అన్న మంగళవారం సాయంత్రం వెళ్లారు. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు ఇవాళ ఉదయం మళ్లీ పోలీసులు వచ్చి తనిఖీలు చేశారు మా ఆధార్ కార్డులు కూడా తీసుకున్నారని మా అన్న ఉగ్రవాదులతో మా ముందు ఎప్పుడూ మాట్లాడలేదంటూ ఆమె తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: