తమిళనాడు రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పటికే అక్కడ డిఎంకె, అన్నాడీఎంకే,బీజేపీ పార్టీలు హోరాహూరీగా పోటీ పడుతూ ఉంటాయి. ప్రస్తుతం డీఎంకే పార్టీ అధికారంలో ఉండి స్టాలిన్ ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలోనే టీవీకే పేరుతో హీరో విజయ్ దళపతి పార్టీని పెట్టారు. తాజాగా తమిళనాడులోని మధురై లో భారీ  బహిరంగ సభ ఏర్పాటు చేసి విజయ్ ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.. తన మనసులోని విషయాలను బయట పెట్టడంతో ఆయనకు వ్యతిరేకంగా తమిళనాడులో నిరసన ఎదురైంది. మరి ఆయన ఏమన్నారో ఆ వివరాలు చూద్దాం.. విజయ దళపతి మధురై  మానాడు పేరుతో ఒక పెద్ద సభ నిర్వహించారు. ఈ సభకు నాలుగు లక్షల మందికి పైగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను సింహంలా సింగిల్గా వస్తానన్నారు. 

ఒక్కసారి సింహం గర్జిస్తే 8 కిలోమీటర్ల మేర భూమి వణికి పోతుందని తెలియజేశారు. అడవుల్లో ఎన్నో తోడేళ్లు ఉంటాయి. సింహం ఒక్కటే ఉంటుంది అంటూ ఎద్దేవా చేశారు. అయితే ఈ సభ పెట్టి బిజెపితో పొత్తు ఉంటుందని  చెబుతాడని చాలా మంది భావించారు. కానీ సభా ముఖంగా ఆయన బిజెపితో అస్సలు పొత్తు ఉండదని,ఉండబోదని తెలియజేశారు. డీఎంకే నా ప్రధాన రాజకీయ శత్రువు అన్నారు. స్టాలిన్ ను అంకులంటూ సంబోధించారు. 1977లో ఎలా రాజకీయ మార్పులు జరిగాయో 2026 లో కూడా అలాంటి రాజకీయ మార్పులే జరుగుతాయంటూ విజయ్ ప్రసంగంలో తెలియజేశారు. బిజెపి తమిళనాడు ముస్లింలను, జాలర్లను టార్గెట్ చేయడం  అసలు తమిళ్ కల్చర్ నే అణచివేయాలని చూడడం బాగాలేదన్నారు. స్టాలిన్ అంకుల్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందంటూ పంచులు విసిరారు.

దీంతో ఆగ్రహించిన డీఎంకే పార్టీ నాయకులు మధురైలో విజయ్ కి వ్యతిరేకంగా పెద్దపెద్ద హోల్డింగ్స్ వేశారు.  అహంకారంతో ప్రవర్తిస్తే పేపర్ పరిణామాలు ఎదురవుతాయి అంటూ హెచ్చరించారు. ఈ విధంగా విజయ్ మొదట్లోనే ఇంత దూకుడు ఉంటే రాబోవు రోజుల్లో విజయం వరిస్తుందా, లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆయన సినిమాల నుంచి వచ్చారు కాబట్టి అంత జనాభా కనబడింది. కానీ ఇదంతా ఓట్లుగా మారుతుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ సభ పెడితే కూడా ఈ విధంగానే జనాలు వచ్చేవారు కానీ ఓట్లుగా మారలేకపోయింది. చివరికి టిడిపి బిజెపితో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీకి గుర్తింపు వచ్చిందనేది మర్చిపోవద్దు విజయ్ అంటూ కొంతమంది రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: