
ఈ విగ్రహం తయారీ కోసం ఏకంగా 69 కేజీల గోల్డ్ ను వినియోగించారు. గతేడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది బంగారం ఖరీదు సైతం ఊహించని స్థాయిలో పెరిగిన సంగతి తెలిసిందే. గతంలో 400 కోట్ల రూపాయలతో ఇన్సూరెన్స్ చేయించగా ఇప్పుడు మొత్తం మరో 20 శాతం ఎక్కువ మొత్తాన్ని ఇన్సూరెన్స్ కోసం ఖర్చు చేయడం కొసమెరుపు. ఈ విగ్రహం కోసం 336 కేజీల వెండి ఆభరణాలను సైతం వినియోగించారట.
జీ.ఎస్.బీ సేవా మండలి ఈ ఇన్సూరెన్స్ ను చేయించింది. భక్తులు, దాతలు కానుకలుగా ఇచ్చిన మొత్తంతో ఈ ఇన్సూరెన్స్ చేయించినట్టు తెలుస్తోంది. అయితే మరీ ఇంత ఆర్భాటాలకు పోవాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్నలు నెటిజన్ల వైపు నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ వినాయకుని ప్రత్యేకతలు తెలిసి అవాక్కవడం నెటిజన్ల వంతవుతోంది.
వినాయక మండపం కోసం ఈ స్థాయిలో ఖర్చు చేస్తారంటే అస్సలు నమ్మశక్యంగా లేదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భారీ వర్షాల వల్ల వినాయకుని ఇబ్బందులు కొంతమేర ఇబ్బందులు పడుతున్నారు. వినాయకుని భక్తులు ఈ విఘ్నలను అధిగమించి గణనాథునికి పూజలు చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే ఛాన్స్ అయితే ఉంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు