
ఇంకా రెండు రోజుల్లో ఆయన పుట్టినరోజు జరగబోతుండటంతో, పవన్ కళ్యాణ్ అభిమానులు పుట్టినరోజును ఎప్పటిలా కాకుండా ఈసారి డిఫరెంట్‌గా సెలబ్రేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, ఆయనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కువగా ఉపయోగించే ఊతపదం గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఎవరికైనా సరే తెలియకుండానే ఎక్కువగా వాడే ఒక పదం ఉంటుంది. అవసరం ఉన్నా లేకపోయినా పలు సందర్భాల్లో ఆ పదాన్ని వాడేస్తుంటారు. అలాగే పవన్ కళ్యాణ్‌కి కూడా ఒక ఊతపదం ఉంది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సినిమా ఈవెంట్స్‌లో గానీ, రాజకీయ మీటింగ్స్‌లో గానీ, ఏదైనా ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడుగానీ పవన్ కళ్యాణ్ చాలా కరెక్ట్‌గా, పక్కాగా మాట్లాడుతారు. కానీ తెలియకుండానే ఆయన తరచుగా వాడే ఒక పదం ఉంది. అదే "అరేయ్". ఆయన ప్రసంగాలను, ఇంటర్వ్యూలను గమనిస్తే ఈ పదాన్ని చాలా సార్లు వాడుతున్నారని అభిమానులు చెబుతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఊతపదం ఇదే అని సోషల్ మీడియాలో జనాలు మాట్లాడుకుంటున్నారు. అభిమానులు కూడా ఈ విషయాన్ని సరదాగా ట్రెండ్ చేస్తూ ఆనందపడుతున్నారు. మనందరికీ తెలిసిందే, పవన్ కళ్యాణ్‌ను అభిమానులు కేవలం ఒక హీరోలా కాదు, ఒక దేవుడిలా భావిస్తారు. అందుకే ఆయనకి అంత క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అంటుంటారు జనాలు.