- లోకేష్-రామ్మోహన్ సరదా సంవాదంతో సభలో నవ్వులపువ్వులు

- ( ఇండియా హెరాల్డ్ - ఉత్త‌రాంధ్ర ) . . .

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ కోటిమంది సభ్యులుగల అతిపెద్ద కుటుంబం. ఎవరు ఏస్థాయి పదవుల్లో ఉన్నా అధినేతలను కుటుంబ పెద్దల్లా గౌరవించడం సాంప్రదాయంగా వస్తోంది. విశాఖ నోవాటెల్ లో జరిగిన ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సదస్సులో పదవులను పక్కనబెట్టి ఆత్మీయతను చాటుకున్నారు నారా లోకేష్, రామ్మోహన్ నాయుడు. ప్రోటోకాల్ ప్రకారం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సదస్సులో చివరిగా మాట్లాడాల్సి ఉండగా, అంతకుముందుగా మంత్రి లోకేష్ ప్రసంగించడానికి ఉపక్రమించారు. అన్నా ముందు నేను మాట్లాడతాను అంటూ రామ్మోహన్ నాయుడు తమస్థానం నుంచి పైకి లేచారు. వెంటనే లోకేష్ వారిస్తూ... వద్దు రాము... ప్రోటోకాల్ ప్రకారం కేంద్ర మంత్రి స్థానంలో ఉన్న నువ్వు చివరగా మాట్లాడాలి, ఇప్పుడు నేనే మాట్లాడతానంటూ లోకేష్ ఉపన్యాసాన్ని ప్రారంభించారు. పదవులను పక్కనబెట్టి అన్నదమ్ముల్లా వారిద్దరి మధ్య సాగిన ఈ సరదా సంభాషణ సభకు విచ్చేసిన ప్రముఖులను అలరించింది.

ఇక కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడుకు చంద్ర‌బాబు తో పాటు యువ‌నేత నారా లోకేష్ సైతం ఎంత ప్ర‌యార్టీ ఇస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. మొన్న కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఎన్డీయే చేరాల‌న్న చ‌ర్చ వ‌చ్చిన‌ప్పుడు కేంద్ర కేబినెట్ మంత్రిగా ఎవ‌రు ఉండాల‌న్న చ‌ర్చ పార్టీలో వ‌చ్చిన‌ప్పుడు లోకేష్ ముందుగా రామ్మోహ‌న్ నాయుడు పేరు ప్ర‌స్తావించ‌గా .. అప్పుడు చంద్ర‌బాబు తో పాటు మిగిలిన నేత‌లు కూడా ఓకే చెప్పారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: