అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యాపార, ఆర్ధిక ప్రపంచంలో హైప్ క్రియేట్ చేశారు. ఆయన చైనా నుంచి దిగుమతులపై అదనంగా 100% టారిఫ్‌లు విధించారని ప్రకటించారు. ఇవి నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నిర్ణయం ప్రపంచ ఆర్థిక, సాంకేతిక రంగాల్లో భయంకర పరిణామాలు రాబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో చైనా కూడా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. అరుదైన ఖనిజాల ఎగుమతులపై నియంత్రణలు విధించడం వల్ల, అమెరికా సైనిక, సెమీకండక్టర్, AI చిప్స్, సాఫ్ట్‌వేర్ పరిశ్రమలకు గట్టిగానే భంగం పడుతుంది. ట్రంప్ దీన్ని జాతీయ భద్రతకు ముప్పు అని పేర్కొన్నారు. ప్రపంచంలో 90 శాతం అరుదైన ఖనిజాల ఉత్పత్తి చైనానే చేస్తోంది. ఈ పరిస్థితే ట్రంప్ టారిఫ్‌లను “అయుధం”గా మార్చింది.


ముందు పరిస్థితి సవ్యంగా ఉండేది. పద్ధతులు పాటిస్తూ, చైనాతో సమన్వయం ఉండేది. కానీ ట్రంప్ అధ్యక్షతలో వందల శాతాల టారిఫ్‌లు వేసి, తర్వాత కష్టపడి 30 శాతానికి తగ్గించి ఒక ఒప్పందం చేశారు. ఇప్పుడు మళ్లీ చైనా ఆ ఖనిజాలను ఎగుమతి చేయకుండా ఆపడంతో, ట్రంప్ టారిఫ్‌లను మరోసారి ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. కానీ సమస్య ఏమిటంటే, చైనాపై టారిఫ్‌లు వేసినా నష్టం అమెరికా ప్రజలకు మాత్రమే. US ఇంపోర్టర్లు ఈ టారిఫ్‌లు చెల్లిస్తారు. చైనా ఉత్పత్తులు ఇతర దేశాల నుంచి అందుకోవడం కష్టం. లభించినా ధరలు పెరుగుతాయి. ప్రత్యామ్నాయాలు లేవు కాబట్టి, తీరులో భారం అమెరికా పౌరులపై పడుతుంది. ట్రంప్ ప్రకటనలతో డౌ జోన్స్ 879 పాయింట్లు, S&P 500 2.71%, నాస్‌డాక్ 3.56% క్షీణించాయి. ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం, ఈ పతనం ఇంకా కొనసాగనుంది.



ట్రంప్ ప్రపంచ దేశాలతో వ్యాపారంలో ఏకపక్ష నిర్ణయాలు తీస్తున్నారు. తమ దేశం కోసం మాత్రమే దిగుమతులు చేయటం, ఇతర దేశాల పరిస్థితులను పరిగణించకపోవటం ఈ సమస్యకు కారణం. ప్రతి రోజూ టారిఫ్‌ల పేరుతో అమెరికా ప్రజలకు కొరడా దెబ్బలు వేసి, తాము “సరైన పనిని” చేస్తున్నట్టుగా భావిస్తున్నారు. ఇలాంటి విధానం, సాధ్యమైనా తక్షణంలో ఆర్థిక, సాంకేతిక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అమెరికా ఇండస్ట్రీలు, సాధారణ పౌరులు కూడా ఈ టారిఫ్‌లు వలన ఎదుర్కొనే ఇబ్బందులు, ధరల పెరుగుదల కష్టాలను తట్టుకోవాల్సి వస్తుంది. ప్రపంచ వాణిజ్యంలో ట్రంప్ వైఖరి, అమెరికా పౌరులకు మళ్లీ షాక్ కలిగించే సిగ్నల్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: