ఇప్పుడు ఎక్కడ చూసిన సరే బీహార్ రాజకియాల గురించే మాట్లాడుకుంటున్నారు జనాలు. బీహార్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. నవంబర్ 6. 11 వ తేదిలల్లో పోల్లింగ్..14 న కౌంటింగ్ జరగబోతుంది. బీహార్‌ రాజకీయ వేదికలో ఈసారి సున్నితమైన గేమ్‌ ప్రారంభమైంది అనే అంటున్నారు రాజకీయ ప్రముఖులు. రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. దీని కోసం ఎన్ డీఏ కూటమి..ఇండియా కూటమీ పోటాపోతిగా తలపడుతున్న నేపధ్యంలో.. మూడో ప్రత్యామ్నాయంగా మరోసారి రాజకీయ వాతావరణాన్ని మార్చడానికి ప్రయత్నిస్తుంది ఏఐఎంఐఎం.


హైదరాబాదు ఎంపీ, ఏఐఎంఐఎం నాయకుడు అసదుద్దీన్‌ ఒవైసీ తాజా ప్రకటనలో, తమ పార్టీ మొత్తం బీహార్ ఎన్నికల్లో 100 స్థానాల్లో పోటీకి సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు. అసదుద్దీన్‌ ఒవైసీ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా బీహార్‌ రాజకీయాలు ఆర్జేడీ-కాంగ్రెస్ లేదా బీజేపీ-జేడీయూ కూటమి చుట్టూ తిరుగుతున్నాయని.. ప్రజలకు నిజమైన ఎన్నికల ప్రత్యామ్నాయం అందించాలన్న వారి ఉద్దేశాన్ని స్పష్టం చేశారు. అంతేకాదు  “మేము ఇప్పుడు ఒక కొత్త రాజకీయ శక్తిగా, మూడో ప్రత్యామ్నాయంగా పరిగణించబడే అవకాశం కల్పించడానికి సిద్ధంగా ఉన్నాము,” అని ఆయన పేర్కొన్నారు.



మజ్లిస్‌తో జతకట్టేందుకు కాంగ్రెస్‌-ఆర్జేడీ కూటమి విముఖత వ్యక్తం చేయటంతో తమ ఉనికి చాటేందుకు ఆ పార్టీ సిద్ధమవుతున్నది.  రాష్ట్ర రాజకీయ నిపుణులు ఈ అంశాన్ని కీలకంగా చూస్తున్నారు, ఎందుకంటే మజ్లిస్‌ పార్టీ 100 స్థానాల్లో పోటీ చేయడం వల్ల కూటముల ఓట్లు  భాగస్వామ్యాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా బీహార్‌ మజ్లిస్‌ చీఫ్ అక్తారుల్ ఇమాన్ మాట్లాడుతూ.. “రాష్ట్రంలో మా ఉనికిని మరింత బలపరచడానికి, ప్రజలకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ దృక్కోణాన్ని చూపించడానికి ఈసారి మేము 100 స్థానాల్లో పోటీకి దిగుతున్నాము. మేము ప్రజల ఆకాంక్షల ప్రతిబింబంగా, నిజమైన ప్రతినిధిగా నిలవడానికి ప్రయత్నిస్తున్నాం,” అని తెలిపారు.



మాజీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, బీహార్‌లో ఎప్పుడూ ప్రధానంగా రెండు కూటములు — ఎన్డీయే (బీజేపీ-జేడీయూ) మరియు కాంగ్రెస్-ఆర్జేడీ — ఆధిపత్యం సాధించాయి. కానీ మజ్లిస్‌ 100 స్థానాల్లో నిష్పత్తిగా అడుగుపెట్టి పోటీకి దిగడం, మూడో ప్రత్యామ్నాయ శక్తిగా రాజకీయ వాతావరణాన్ని మార్చే అవకాశం కల్పిస్తుంది. రాష్ట్రంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఇంకా రసవత్తరంగా, ప్రతీ రోజు కొత్త రాజకీయ పరిణామాలతో కొనసాగుతున్న నేపథ్యంలో, మజ్లిస్‌ ఈ అడుగు సరైన సమయానికి పెట్టినట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఎన్నికల వేదికపై అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని మజ్లిస్‌ ప్రభావం ఎంతవరకు ఉంటుందో చూడాలి..? కొంత మంది అసదుద్దీన్‌ కరెక్ట్ గా టైం చూసి కొట్టాడని ..ఇప్పుడు బీహార్ రాజకీయాలల్లో కొత్త ఛాప్టర్ స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..??

మరింత సమాచారం తెలుసుకోండి: