జూబ్లీహిల్స్  ఉప ఎన్నిక అనేది చాలా రసవత్తరంగా సాగబోతోంది. ఇప్పటికే రెండు ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు రంగంలోకి దిగారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ కుమార్ యాదవ్ రంగంలోకి దిగారు. ఇక బీజేపీ ఒక ముగ్గురి పేర్లను పరిశీలనలో పెట్టి ఉంచింది.. మరి కొన్ని గంటల్లో వాళ్లలో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. అలాంటి జూబ్లీహిల్స్ లో  విజయాన్ని డిసైడ్ చేసేది ముస్లిం ఓటర్లు. వాళ్లు ఏ వైపు ఓట్లు వేస్తే ఆ వైపు విజయం అనేది ఉంటుంది. అయితే జూబ్లీహిల్స్ ఎన్నికను బీఆర్ఎస్ పార్టీ జీవన్మరణ పోరాటంగా తీసుకుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో గెలిస్తే మళ్లీ తెలంగాణలో బీఆర్ఎస్ కు కొత్త ఊపు వచ్చి పార్టీ గాడిన పడుతుంది. 

అలాంటి ఈ సమయంలో హరీష్ రావు, కేటీఆర్ ప్రత్యక్షంగా ప్రచారం చేస్తూ జూబ్లీహిల్స్ లోనే మకాం వేశారు. అలాగే కాంగ్రెస్ ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇందులో గెలిస్తేనే హైదరాబాదులో మరింత చోటు దక్కుతుంది మరియు స్థానిక ఎలక్షన్స్ లో కూడా ఊపు వస్తుందని ఆలోచనలో ఉంది. ఇదంతా నడుస్తున్న సమయంలోనే బిజెపి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. మరి ఇంత జరుగుతున్న కేసీఆర్ మాత్రం ఉప ఎన్నికకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఆయన ఒకవేళ బయటకు వచ్చి ఒక్క సభ పెట్టి ప్రచారం చేశారంటే వన్ సైడ్ ఎన్నిక అయ్యే అవకాశం మాత్రం ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు.

కానీ కేసీఆర్ అక్కడ రిజల్ట్ ను ముందుగానే గమనించి బయటకు రాకుండా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆయన వచ్చి ప్రచారం చేసిన తర్వాత కూడా బీఆర్ఎస్ అక్కడ ఓడిపోతే ఇక రాష్ట్రంలో పూర్తిగా దెబ్బ తినే అవకాశం ఉందని ఆయన బయటకు రావడం లేదని తెలుస్తోంది. అయితే ఆయన ప్రచారానికి రాకపోవడం వెనక మరో కారణాన్ని కూడా వెతుకుతున్నారు. బిజెపికి సపోర్ట్ చేసేందుకే ఆయన బయటకు రావడం లేదని, దుబ్బాకలో కూడా ఆ విధంగానే ప్రవర్తించారని దానివల్లే దుబ్బాకలో బిజెపి గెలిచిందని భావిస్తున్నారు. ఈ విధంగా  ఎన్నికల రిజల్ట్ అనేది ఈ  మూడు పార్టీలకు జీవన్మరణ పోరాటంలా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: