‘మిత్ర మండలి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత బన్నీ వాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వ‌ర్గాల్లో చర్చకు దారితీశాయి. ఈ ఈవెంట్‌లో ఆయన ఆవేశం, ఆవేదనతో చేసిన వ్యాఖ్యల్లో ఉన్న కొన్ని పదాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బన్నీ వాస్ మాట్లాడుతూ, తమ సినిమాను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరు కావాలనే నెగటివ్ ట్రోలింగ్ చేస్తున్నారని విమర్శించారు. యూట్యూబ్ కామెంట్లు, సోషల్ మీడియా పోస్టులు రూపంలో దురుద్దేశపూర్వకంగా విమర్శలు చేస్తున్నవాళ్లు ముందుగా కంటెంట్ చూసి మాట్లాడాలని సలహా ఇచ్చారు. “అందరి సినిమాలు బాగుండాలని కోరుకుంటాం, మన కంటే ఇతర సినిమా బాగుంటే దానిని కూడా ప్రోత్సహిస్తాం” అని ఆయన చెప్పడం వరకు అందరూ ప్రశంసించారు.


అయితే ఆ తర్వాత ఆయన చేసిన ఒక వ్యక్తిగత వ్యాఖ్య మాత్రం వివాదానికి దారితీసింది. ట్రోలింగ్ చేస్తున్న వారిని ఉద్దేశించి “బ్రదర్” అని సంబోధిస్తూ, వెంట్రుకల గురించి చేసిన వ్యాఖ్య చాలా మందికి అభ్యంతరకరంగా అనిపించింది. బన్నీ వాస్ అగ్ర నిర్మాతగా టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు. బ‌న్నీ వాస్‌ గీతా ఆర్ట్స్ బ్యానర్‌కు సంవత్సరాల పాటు బలమైన స‌పోర్ట‌ర్‌గా ఉంటూ అక్క‌డ వ్య‌వ‌హారాలు చ‌క్క పెడుతున్నారు. పైగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు అత్యంత సన్నిహితుడు. ఇటీవల స్వంత బ్యానర్‌లో ‘లిటిల్ హార్ట్స్’ వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించారు.


అలాంటి స్థాయిలో ఉన్న నిర్మాతగా, ఆయన మాటలు మరింత సంయమనంతో ఉండాల్సిన అవసరం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ట్రోలింగ్, నెగటివ్ క్యాంపెయిన్స్ కొత్తవేమీ కావు. కానీ వాటిని నియంత్రించేందుకు సైబర్, లీగల్ మార్గాలు ఉన్నాయి. బన్నీ వాస్ ఇప్పటికే సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయగా, ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారని సమాచారం. ఈ రూట్లో వెళ్ల‌కుండా నా వెంట్రుక‌, నాకు సంస్కారం ఉంది కాబ‌ట్టే.. త‌ల వెంట్రుక చూపిస్తున్నాను.. మ‌రో వెంట్రుక చూపించ‌డం లేద‌ని కామెంట్ చేయ‌డం చాలా మందికి న‌చ్చ‌లేదు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: