జోగి రమేష్ కు కల్తీ మద్యం కేసులో నిందితుడుగా ఉన్నటువంటి జనార్దన్ రావుకు మధ్య ఉన్న బంధాన్ని వివరిస్తూ IVRS ద్వారా ప్రజలకు కాల్స్ చేస్తోందని, ముఖ్యంగా ఇందులో జోగి రమేష్ పేరును ప్రస్తావిస్తోందని దీనిపైన అభ్యంతరాన్ని తెలియజేస్తూ వైసీపీ నేత జోగిరమేష్ పోలీసులను ఆశ్రయించారు. ఒకవైపు కల్తీ మద్యం కేసు గురించి దర్యాప్తు జరుగుతూ ఉంటే..ఇలా IVRS కాల్స్ చేయడం ఏంటంటు ప్రశ్నించారు? ఈ విషయం పైన జోగి రమేష్ మరి కొంతమంది వైసిపి నేతలతో కలిసి మంగళగిరిలో ఉండే డీజీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
నకిలీ మద్యంలో అడ్డంగా దొరికిపోయి ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న కూటమి ప్రభుత్వం కుట్ర చేసి మరి ఇలా IVR కాల్స్ ద్వారా తమ పైన విష ప్రచారాన్ని చేస్తున్నారంటూ వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు జోగిరమేష్ . నకిలీ మద్యం పై కూటమి ప్రభుత్వం పై ప్రజలు అసహ్యించుకుంటున్నారని వీటికి సమాధానాలు చెప్పలేక ఇలా డైవర్షన్ పొలిటికల్స్ చేస్తున్నారంటూ కూటమి నేతల పై ఫైర్ అయ్యారు వైసీపీ నేతలు , వైసీపీ నేత జోగి రమేష్. ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకొని మరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద బురదజల్లే విషయంపై ఎల్లో మీడియా కూడా అడ్డగోలుగా వ్యవహరిస్తుందంటూ జోగి రమేష్ ఆరోపణలు చేశారు. నకిలీ మద్యానికి సంబంధించి ఆధారాలను చూపించకుండా వారం రోజులుగా విష ప్రచారం చేస్తున్నారని, IVRS కాల్స్ పైన విచారణ చేసి వాటి వెనక దాగి ఉన్నది ఎవరో తేల్చాలని వైసిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు. అలాగే సిబిఐకి కూడా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి