ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళంలోని పలాస లోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా కన్నీళ్లు పెట్టిస్తోంది.. ఇప్పటికే ఈ తొక్కిసలాట లో పదిమంది చనిపోయారు.దీంతో తొక్కిసలాటలో చనిపోయిన మృతదేహాల ముందు కుటుంబ సభ్యుల కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ వీడియోలు చూసి ఎంతోమంది చలించిపోతున్నారు. అయితే పలాసలో కాశీ బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఈ తొక్కిసలాటకి ప్రధాన కారణం సోషల్ మీడియానే అంటూ ఒక సంచలన నిజం వెలుగులోకి వచ్చింది . మరి సోషల్ మీడియా వల్ల కాశీబుగ్గలో తొక్కిసలాట  ఎందుకు జరిగింది అనేది ఇప్పుడు చూద్దాం.. ఈ మధ్యకాలంలో ఏదైనా కొత్త వింత ఉంటే కచ్చితంగా దాన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.అంతేకాదు ఇటీవల కాలంలో ఎక్కడైనా కొత్త ఆలయాలు నిర్మిస్తే చాలు అక్కడికి భక్తులు పోటెత్తుతున్నారు.

 ముఖ్యంగా అక్కడికి వెళ్లి ఈ గుడి స్పెషలిటీ ఇది అని, ఇక్కడికి వస్తే ఆ కోరిక నెరవేరుతుంది ఈ కోరిక నెరవేరుతుంది అంటూ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియా ద్వారా తెగ ప్రచారం చేస్తున్నారు. అలా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇలా ప్రతి ఒక్క సోషల్ మీడియా ఆయుధాన్ని వాడుకుంటూ ఆలయాలకు సంబంధించిన ప్రాముఖ్యతను తెలుపుతూ ఎన్నో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు.అయితే ఈ వీడియోలు చూసిన చాలామంది నిజంగానే ఆలయంలో అలాంటి శక్తి ఉంది కావచ్చు కోరిన కోరికలు నెరవేరుతాయి కావచ్చు అని ఆలయాలకు వెళ్లి దేవుళ్లను దర్శించుకొని కోరికలు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు పవిత్ర ఏకాదశి కావడంతో ఏపీలోని శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయానికి చాలామంది భక్తులు పోటెత్తారు. అయితే ఈ ఆలయ సామర్థ్యం కేవలం రెండు మూడు వేల మందికి మాత్రమే.

 కానీ ఈరోజు ఏకాదశి కారణంగా 25 వేల మంది రావడంతో ఈ ఘటన జరిగింది. అయితే కార్తీక మాసం కావడం అందులోనూ పవిత్ర ఏకాదశి కావడంతో ఇక్కడికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.అలా ఈ తొక్కిసలాట జరిగింది.ఇక సోషల్ మీడియా కూడా  పరోక్ష కారణం అంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. అయితే దీనిపై స్పందించిన దేవాదాయ శాఖ అది ప్రైవేట్ గుడి అని, అది ప్రభుత్వ ఆధీనంలో లేదు అని నిర్వాహకుల వైఫల్యం వల్లే ఈ తొక్కిసలాట జరిగింది అంటూ తెలిపారు.అలాగే ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం కూడా ఇవ్వకుండా ప్రైవేటుగా చేసుకున్నారని తెలిపారు. ఇక ఇప్పటికే ఈ తొక్కిసలాట ఘటన పట్ల ప్రధాని మోదీ స్పందించారు. చనిపోయిన బాధిత కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్గ్రేషియా, క్షత గాత్రులకు 50 వేలు ఎక్స్గ్రేషియా  ప్రకటించడంతోపాటు చనిపోయిన వారికి సంతాపం ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: