ఇటీవల కాలంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు  అన్ని రంగాలలోనూ, అన్ని విషయాలపై మీలో ఒక అవగాహన తీసుకురావడం కోసం ఇండియా హెరాల్డ్ ఎప్పుడూ తపిస్తూనే ఉంటుంది.  అందులో భాగంగానే మంచి మాట రూపంలో మిమ్మల్ని మార్చడం కోసం, మీలో మనోధైర్యాన్ని నింపడం కోసం సరికొత్త ఆలోచనలతో మీ ముందుకు రావడం జరిగింది.. ఇక ఎప్పటిలాగే ఈ రోజు కూడా ఒక మంచి మాటను మీ కోసం మీ ముందుకు తీసుకు వచ్చింది.. అదేమిటంటే..ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా ఉంటే దాన్నుంచి సగం బయట పడినట్టే..



దీని వివరణ ఏమిటంటే.. ఏదైనా మీకు ఒక సమస్య వచ్చినప్పుడు, చాలామంది భయబ్రాంతులకు గురి అవుతుంటారు. ఒక్కోసారి అనుకోని సందర్భాలలో ఆత్మహత్య కూడా చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువ. అయితే ఎప్పుడైతే మీరు ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా ఉంటారో ఆ ఆపద నుంచి సగం బయట పడినట్టే అని దీని అర్థం..


నిజమే కదా..!  ఏదైనా ఆపద వచ్చినప్పుడు భయపడిపోయి,  తీవ్ర దిగ్భ్రాంతికి గురై, ఆ ఆపదను లేదా ఆ సమస్యను మరింత తీవ్రతరం చేసుకుంటున్నారు మనలో చాలా మంది. అయితే ఏదైనా ఆపద వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి,  ఆ ఆపద ఎందుకు వచ్చింది.. దానికి గల కారణాలేంటి..అని అన్వేషిస్తే మాత్రం అది చాలా చిన్న సమస్యగా మారుతుంది అని అంటున్నారు  నిపుణులు.


ఏదైనా ఒక సమస్యకు కారణాలు తెలుసుకుంటే దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఆపద అయినా సరే,  సమస్య అయినా సరే ఆలోచనాశక్తి అనేది తప్పనిసరిగా ఉండాలి. మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఎలాంటి సమస్య నుంచి అయినా బయటపడవచ్చు.  కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదైనా ఆపద వచ్చినప్పుడు భయపడకుండా, అది ఎందుకు వచ్చింది.. ఎలా వచ్చింది..అని తెలుసుకొని దానికి గల కారణాలను వెతకండి. అప్పుడే దాని గల కారణాలు ఏమిటో తెలుసుకొని ఆ ఆపద నుంచి బయటపడటానికి సులువైన మార్గం దొరుకుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: