క్రికెట్ ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు మహేంద్రసింగ్ ధోని. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తర్వాత ప్రపంచంలోని క్రికెట్ దేశాల అభిమానులను అక్కున చేర్చుకున్న ఆటగాడు ఎంఎస్ ధోని. కెప్టెన్ గా, ఆటగాడిగా ధోని సృష్టించిన రికార్డులు ఎన్నో. భారత్ కి మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్ కూల్ ధోని. ఫార్మాట్ ఏదైనా ఫినిషింగ్ కి కొత్త భాష్యం చెప్పిన పవర్ హిట్టర్. వికెట్ కీపర్ గా గతంలో ఏ ఆటగాడు సాధించిన రికార్డులను, స్టంపింగ్ లో వేగాన్ని, రన్ అవుట్ లో లౌక్యాన్ని ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కటేమిటి ధోని గురించి ఎన్నో ఉన్నాయి.

నేడు ఆయన 40వ వడిలోకి అడుగు పెడుతున్నాడు. 1981లో జార్ఖండ్ లోని రాంచీ లో జన్మించిన మహేంద్ర సింగ్ ధోనీ దేశవాళీ క్రికెట్లో తన ఆటతో వెలుగు లోకి వచ్చాడు. భారత్ తరపున 2004 లో ఆడిన ఫస్ట్ మ్యాచ్ లో రన్ ఔట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత తప్పిదాలను తెలుసుకుని విశాఖపట్నం వేదికగా పాకిస్తాన్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో బాగా ఆడి సెంచరీ చేసి గాడిన పడ్డాడు. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. 2007 వరల్డ్ కప్ తర్వాత దశాబ్దంపాటు తిరుగులేని కెప్టెన్ గా ఉన్నాడు. 

2011 ప్రపంచ కప్, ఆ తరువాత 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, అంతకు ముందు  2007 టీ 20 వరల్డ్ కప్ భారత్ కు అందించాడు కెప్టెన్ ధోని. కానీ ఆయన కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. చివరి అంకంలో జట్టులో స్థానం కోల్పోయిన ఎంఎస్ ధోని తన పూర్వ వైభవం తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. ఎలాంటి ఆడంబరాలు లేకుండా తన రిటైర్మెంట్ ప్రకటించాడు.  2011 వన్డే ప్రపంచకప్ సమయంలో సీనియర్ ఆటగాళ్లను పక్కన పెట్టడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ఆయన ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై తరఫున కెప్టెన్ గా ఆడుతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: