ఐపీఎల్ లో ఎంత మంది ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకుని సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే అటు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు పృథ్వీ షా  అదరగొడుతున్నాడు అన్న విషయం తెలిసిందే. మొన్నటివరకు పేలవమైన ఫామ్ కారణంగా ఇబ్బందులు పడ్డాడు. అంతేకాకుండా ఐపిఎల్ ప్రారంభానికి ముందు ఫిట్నెస్ టెస్టుల్లో  కూడా ఫెయిల్ అయ్యాడు. దీంతో ఈసారి పృథ్వీ షా ఏం రాణిస్తాడులే అని అందరూ అనుకున్నారు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి మంచి ఓపెనింగ్స్ ఇస్తున్న పృథ్వీషా భారీగా పరుగులు చేస్తున్నాడు అనే చెప్పాలి. ఇక ఇప్పటి వరకూ ఎన్నో మ్యాచ్ లలో ఆ జట్టు విజయంలో కీలక పాత్ర వహించాడు.


 ఇలా ఢిల్లీ క్యాపిటల్స్ తరపున బాగా రాణిస్తున్న పృథ్వీ షా కు ఇటీవల ఐపీఎల్ నిర్వాహకులు షాకిచ్చారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను  భారీ జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలె లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా కు జరిమాన పడిన తెలుస్తుంది. మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. లెవల్ వన్ నేరానికి పాల్పడటం తో ఇక అలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి లోని ఆర్టికల్ 2.2 కింద లెవెల్ వన్ నేరానికి పాల్పడినట్లు అటు ఓపెనర్ పృథ్వీషా అంగీకరించాడు.


 ఈ క్రమంలోనే మ్యాచ్ రిఫరీ తుది నిర్ణయం మేరకు జరిమానా విధించినట్లు ఐపీఎల్ నిర్వాహకులు ఇటీవల సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేశారు. అయితే పృథ్వీషా ఐపీఎల్లో ప్రవర్తన నియమావళిని ఎక్కడ ఉల్లంఘించాడు. ఏం చేశాడు అనే విషయంపై మాత్రం అటు ఐపీఎల్ నిర్వాహకులు స్పష్టతను ఇవ్వకపోవడం గమనార్హం. కాగా ఇటీవలే లక్నో తో జరిగిన మ్యాచ్ లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసిన పృథ్వీషా తీవ్రంగా నిరాశ పరిచాడు. కాగా ఈ మ్యాచ్లో ఢిల్లీ కాపిటల్స్ ఓటమి చవిచూసింది. ఆరు పరుగుల తేడాతో లక్నో జట్టు విజయం సాధించడం గమనార్హం..

మరింత సమాచారం తెలుసుకోండి: