అక్టోబర్ నెలలో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే జట్టు వివరాలను ఇటీవలే బీసీసీఐ ప్రకటించింది. సీనియర్ బౌలర్గా ఎంతగానో అనుభవం ఉన్న మహమ్మద్ షమినీ కేవలం స్టాండ్ బై ప్లేయర్గా మాత్రమే ఎంపిక చేశారు.  దీంతో ఇదే విషయంపై గత కొన్ని రోజుల నుంచి ఎంతగానో చర్చ జరుగుతూ వస్తోంది. మహమ్మద్ షమీ లాంటి సీనియర్ బౌలర్ ను పక్కన పెట్టడం ఏంటి అంటూ అందరూ ప్రశ్నించారు. అయితే మహమ్మద్ షమీ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా లతో జరగబోయే టి20 సిరీస్ లో బాగా రాణిస్తే తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉందని ఇటీవలే భారత సెలెక్టర్లలో ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు.  ఇక మాజీ క్రికెటర్లు కూడా ఇదే విషయంపై స్పందించారు.


 దీంతో ఇక టి20 వరల్డ్ కప్ లో తుది జట్టులో అవకాశం దక్కించుకోవాలి అంటే ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా లో జరగబోయే టి20 సిరీస్ లో బాగా రాణించాలని అందరూ కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అభిమానులందరికీ కూడా ఊహించని షాక్ తగిలింది.. దాదాపు పది నెలల తర్వాత టి20 జట్టులో అవకాశం దక్కించుకున్న మహ్మద్ షమీ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే జట్టుకు దూరమయ్యాడు అన్నది తెలుస్తుంది. మహమ్మద్ షమి ఇటీవలే కరోనా వైరస్ బారిన పడ్డాడు.


 ఇక ఈ విషయాన్ని బిసిసిఐ అధికారికంగా ప్రకటించింది అని చెప్పాలి.  ఈ క్రమంలోనే  ఆస్ట్రేలియాతో  స్వదేశంలో జరగబోతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కు మొహమ్మద్ షమీ దూరం అయ్యాడు అన్నది తెలుస్తుంది. మహ్మద్ షమి స్థానంలో ఉమేష్ యాదవ్ ను జట్టులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా టి20 వరల్డ్ కప్ కి కూడా దూరమయ్యాడు. ఇక దాదాపు పది నెలల తర్వాత టీ 20 జట్టు లో అవకాశం దక్కించుకున్న మొహమ్మద్ షమీ అదరగొడతాడు అనుకుంటే వైరస్ బారిన పడటంతో అభిమానులు నిరాశలో మునిగిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: