విరాట్ కోహ్లీ టీమ్ ఇండియా సారధ్య బాధ్యతలు అందుకున్న తర్వాత ఎంతల సక్సెస్ అవుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటూ మ్యాచ్ మొత్తాన్ని కూడా తనవైపుకు తిప్పేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే తన పదునైన వ్యూహాలతో ప్రత్యర్ధులను కట్టడి చేసి వరుస విజయాలు సాధిస్తూ ఉన్నాడు. టీమిండియా విదేశీ పర్యటనకు వెళ్లిన.. లేకపోతే ప్రత్యర్థి జట్టు భారత పర్యటనకు వచ్చిన ఇక సిరీస్ మాత్రం కైవసం చేసుకునేది టీమిండియానే  అన్న విధంగా ఇక వరుస విజయాలు అందిస్తున్నాడు అని చెప్పాలి.


 ఇక ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ లో కూడా రోహిత్ శర్మ తన కెప్టెన్సీ వ్యూహాలతో మ్యాజిక్ చేస్తూ ఉన్నాడు.  జట్టుకు వరుస విజయాలు అందిస్తున్నాడు. కానీ కెప్టెన్ గా సక్సెస్ అవుతున్న రోహిత్ శర్మ ఒక ఆటగాడిగా మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాడు. ఒక నెదర్లాండ్స్ పై మినహా ఏ జట్టుపై కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు రోహిత్ శర్మ. ఇక రోహిత్ శర్మ ఫామ్ అటు జట్టును ఆదిలోనే కష్టాల్లోకి నెడుతూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే రోహిత్ వరుస  వైఫల్యం ఇప్పటికే ఎంతమంది మాజీ ఆటగాళ్లు స్పందిస్తూ తమ అభిప్రాయాలు పంచుకున్నారు.


 ఇక ఇప్పుడు ఏకంగా ఇంగ్లాండు జట్టులో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న బెన్ స్టోక్స్ రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ గురించి స్పందించాడు.  రోహిత్ శర్మ ఫామ్ లో ఉంటే ఎంత డేంజర్ అనే విషయం మాకు స్పష్టంగా తెలుసు. కానీ ప్రస్తుతం అతను ఫామ్ లేమీ తో ఇబ్బంది పడటం చూస్తుంటే మాత్రం జాలి కలుగుతుంది అంటూ బెన్ స్టోక్స్ వ్యాఖ్యానించాడు. కానీ అతను ఫామ్ లోకి రావడానికి ఒక ఇన్నింగ్స్ చాలని.. అది మాపై ఆడకూడదు అని గట్టిగా కోరుకుంటున్న అంటూ స్టోక్స్ వ్యాఖ్యానించాడు. ఫామ్ లో లేడని రోహిత్ ను లైట్ తీసుకునే ఛాన్స్ అసలు లేదు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: