
ఇలాంటి సమయంలోనే ఒకప్పుడు భారత జట్టులో చోటు సంపాదించుకుని పేలవమైన ఫామ్ తో జట్టుకు దూరమైన ఆటగాళ్లు మళ్ళీ జట్టులో చోటు కోసం నిరీక్షణగా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలా గత కొంతకాలం నుంచి నిరీక్షణగా ఎదురు చూస్తూ నిరాశలో మునిగిపోతున్న ఆటగాళ్లలో యువ సంచలనం పృథ్వి షా కూడా ఉన్నాడు అని చెప్పాలి. ఎన్నో రోజుల నుంచి టీమిండియాలో చోటు దక్కుతుందేమో అని ఆశగా ఎదురు చూడటం.. ఇక టీమిండియా జట్టు ఎంపిక చేసిన తర్వాత అందులో తన పేరు లేకపోవడంతో నిరాశతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం పృద్వి షా విషయంలో పరిపాటిగా మారిపోయింది అని చెప్పాలి.
పృథ్వి షా చివరిసారిగా జూలై 2021 లో భారత తరఫున ఆడాడు. అప్పటినుంచి టీమ్ ఇండియాకు ఆడలేదు. అయితే ఇక వచ్చే ఏడాదిలో అటు శ్రీలంకతో జరగబోయే టి20 వన్డే సిరీస్ లో తనకు చోటు దక్కుతుందని ఆశపడ్డాడు. కానీ అది జరగలేదు. ఈ క్రమంలోనే బీసీసీఐ పై తన అసంతృప్తిని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ వ్యక్తపరిచాడు పృద్వి షా. ఎవరైనా నవ్వుతూ ఉంటే వారు తమ జీవితంలో సంతోషంగా ఉన్నారని కాదు. ఆనందం ఎప్పుడూ దానంతట అదే రాదు. కానీ సమస్యలు మాత్రం వాటంత అవే వస్తాయి. ఎవరైనా సరే సానుకూలత ప్రేమ సంతోషాన్ని ఎంచుకుంటారు. కోపం ద్వేషం ప్రతికూలత అనేది మనుషులలో స్వయంచాలకంగా ఉంటాయి. ప్రేమ సానుకూలత ఎంచుకుంటేనే మనం మనుషులుగా ఉంటాం అంటూ రెండు పోస్టులు పెట్టి తన నిరాశను వ్యక్తపరిచాడు పృథ్వి షా.