
కానీ ప్రస్తుతం భారత బ్యాటింగ్ విభాగం కష్టాల్లో పడిపోయింది అని చెప్పాలి. టాప్ ఆర్డర్ మొత్తం కుప్పకూలిపోయింది. ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ అయినా నాథన్ లియోన్ ముందు భారత బ్యాట్స్మెన్లు తేలిపోయారు అని చెప్పాలి. ఇక అతనొక్కడే వరుసగా రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్, పూజార, శ్రేయస్ అయ్యర్ లాంటి కీలకమైన బ్యాట్స్మెన్ ల వికెట్లను పడగొట్టాడు. దీంతో ప్రస్తుతం భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఇలాంటి సమయంలో ఇక భారత అభిమానులు అందరూ కూడా రిషబ్ పంతుని గుర్తు చేసుకుంటున్నారు.
ఒకవేళ రిషబ్ పంత్ జట్టులో ఉండి ఉంటే ఇక అతను తన బ్యాట్ తో విజృంభించే వాడు అంటూ భావిస్తూ ఉన్నారు అభిమానులు. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో భాగంగా ఇద్దరు ఓపెనర్లను అవుట్ చేసిన నాథన్ లియోన్ అక్కడితో ఆగకుండా మరో రెండు వికెట్లు తీసి టీమ్ ఇండియాను దెబ్బ కొట్టాడు అని చెప్పాలి. అయితే ఇలా నాలుగు వికెట్లు తీసిన నాథన్ లయన్ బౌలింగ్ లోనే గతంలో రిషబ్ పంత్ చితక్కొట్టుడు కొట్టాడు. అందుకనే పంత్ ఉండుంటే పరిస్థితి మరోలా ఉండేదని టీమిండియా ఫ్యాన్స్ అందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు అని చెప్పాలి.