
అయితే ఒకవేళ బిసిసిఐ ఆసియా కప్ కోసం పాకిస్తాన్ పర్యటనకు రాకపోతే.. తాము కూడా భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటాము అంటూ అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సైతం చెప్పింది అన్న విషయం తెలిసిందే. కానీ ఈ విషయంపై తుది నిర్ణయానికి ఇక ఇరు దేశాలు ఇప్పటివరకు రాలేదు. ఇదే విషయంపై భారత కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాగూర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్లో జరిగే ఆసియా కప్ లో పాల్గొనాల వద్ద అనే విషయంపై బీసీసీ నిర్ణయం తీసుకోవాలి అంటూ సూచించాడు అనురాగ్ ఠాగూర్.
భారత క్రికెట్ నియంత్రణ మండలి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతనే క్రీడా మంత్రిత్వ శాఖ హోంశాఖ పర్యటన అంశాన్ని పరిశీలిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే గత ఏడాది అక్టోబర్ లో మాత్రం ఈ విషయంపై ముందే హోంశాఖ నిర్ణయం తీసుకుంటుంది అంటూ అనురాగ్ ఠాగూర్ చెప్పుకొచ్చాడు. షెడ్యూల్ ప్రకారమే ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆసియా కప్ జరగాల్సి ఉండగా భద్రతా కారణాల దృశ్య తాము అక్కడ పర్యటించలేమని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జై షా ప్రకటించారు. ఇక ఇలాంటి సమయంలో ఇక ఇప్పుడు కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాగూర్ చేసిన వ్యాఖ్యలు కాస్తా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి.