ఐపీఎల్ హిస్టరీ లో  పటిష్టమైన జట్లలో ఒకటిగా కొనసాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఒక పీడకలలా మిగిలిపోతుంది అన్నది మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే మొదటి మ్యాచ్ నుంచి ప్రతి మ్యాచ్ లొ వరుసగా విఫలం అవుతూ వస్తుంది  పాయింట్ల పట్టికలో చిట్ట చివరన కొనసాగుతూ ఉంది. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్ ఆడిన ఢిల్లీ జట్టు కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది అని చెప్పాలి. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్రదర్శన పై అట అభిమానులు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



 అయితే గతంలో సన్రైజర్స్ హైదరాబాద్ కు జట్టుతో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి సత్తా చాటిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు  ఇటీవల మరోసారి అదే జట్టుతో జరిగిన మ్యాచ్లో మాత్రం ఓటమిని కొని తెచ్చుకుంది. ఒకానొక దశలో వికెట్ నష్టపోకుండా 112 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఢిల్లీ జట్టు ఎంతో సులభంగా విజయం సాధిస్తుందని అందరూ భావించారు. కానీ ఆ తర్వాత తక్కువ వ్యవదిలోనే  ఓపెనర్లు ఓపెన్ కూడా అవుట్ అయ్యారు. దీని తర్వాత వచ్చిన ఏ ఆటగాడు కూడా కనీసం క్రీజులో ఎక్కువసేపు నిలబడలేకపోయారు. అయితే ఫామ్ లో ఉన్న అక్షర్ పటేల్ ను ఏడవ స్థానంలో బ్యాటింగ్ కి పంపాడు కెప్టెన్ వార్నర్.



 అయితే క్రీజు లోకి వచ్చిన అక్షర్ పటేల్ జట్టును గెలిపించేందుకు శాయ శక్తుల ప్రయత్నించాడు. రావడం రావడమే ఎంతో దూకుడుగా ఆడాడు. 14 బంతుల్లో ఒక ఫోర్ రెండు సిక్స్ లు సహాయంతో 29 పరుగులు చేశాడు. అతను బ్యాటింగ్ కి వచ్చే సమయానికి తక్కువ బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో అతను కూడా ఏం చేయలేకపోయాడు. శార్దూల్ ఠాకూర్ను బ్యాటింగ్ ఆర్డర్లో పంపే విషయంలో వార్నర్ కాస్త తెలివిగా వ్యవహరించి.. అతన్ని కాస్త ముందు పంపించి ఉంటే మాత్రం ఢిల్లీ జట్టు గెలిచేది అని అభిమానులు అనుకుంటున్నారు. శార్దూల్ ఠాకూర్  కి బదులు ఫామ్ లో లేని మనీష్ పాండే, ప్రియం గార్గ్ లను ముందు పంపించడం ఏంటి అంటూ వార్నర్ ని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl