ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఎంత ఉత్కంఠ భరితంగా సాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రేక్షకులు ఊహించిన దాని కంటే రసవత్తరంగా ప్రతి మ్యాచ్  సాగుతూ ఉంది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం లీగ్ మ్యాచ్లు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ఐపీఎల్ పోరు మరింత రంజుగా మారిపోయింది. దీంతో ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకుండా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.  ఇక అన్ని జట్లు కూడా టైటిల్ గెలిచేందుకు పదునైన  వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి. ఇకపోతే అటు బిసిసిఐ కూడా ఆటగాళ్ల పట్ల కట్టినంగానే వ్యవహరిస్తుంది. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే ఇక భారీగా జరిమానాలు విధిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం.


 అయితే ఇప్పటికే స్లో ఓవర్ రేట్ కారణంగా బీసీసీఐ ఆయా జట్ల కెప్టెన్ల నుంచి దాదాపు 1.0  కోట్ల రూపాయలు వసూలు చేసింది అన్న విషయం ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక మరోవైపు ప్రవర్తన నియమావళి ఉల్లంఘించినందుకు కూడా కొంతమంది ఆటగాళ్లకు జరిమాణాలు వేస్తుంది. అయితే ఇటీవల ఐపీఎల్ లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో కూడా రాజస్థాన్ స్టార్ బ్యాట్స్మెన్ జాస్ బట్లర్ కి ఇలాగే జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నాడు మ్యాచ్ రిఫరీ.



 ఏకంగా మ్యాచ్ ఫీజులో 10% కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి. కోల్కతాతో జరిగిన మ్యాచ్లో రన్ అవుట్ అయిన తర్వాత బట్లర్ ప్రవర్తన సరిగా లేకపోవడంతో.. మ్యాచ్ రిఫరీ ఇక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక కోల్కత్తా తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. అయితే ఇక ఈ మ్యాచ్ లో ఓటమి ద్వారా కోల్కతా జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు కోల్పోయింది అని చెప్పాలి. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో కేవలం ఆటగాళ్ల ప్రదర్శన మాత్రమే కాదు అటు మ్యాచ్ రిఫరీలు ఆటగాళ్లకు విధిస్తున్న జరిమాణాలు కూడా తెగ చర్చనీయాంశంగా మారిపోతూ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl