ఇటీవల అతి తక్కువ వయసులోనే చాలా మంది సినిమా రంగానికి చెందిన వారు మరణించడం జరిగింది. వారిలో ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్ ఒకరు. ఈయన జీవితంలో తెలియని కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వివేక్ 1961 నవంబర్ 19 న తూత్తుకుడి జిల్లాలో జన్మించాడు. వివేక్ మొదటగా తమిళనాడు ప్రభుత్వ సెక్రటేరియట్ లో పని చేస్తూ ఉండేవాడు. నటుడి అవ్వాలనేది అతని కోరిక. కానీ అవకాశాల కోసం ఎలా వెళ్లాలి అనేది తెలిసేది కాదు. నటన మీద తనకు ఉన్న ప్రత్యేకమైన శ్రద్ద కారణంగా స్టాండప్ కమెడియన్ గా స్టార్ట్ చేశాడు. అయితే ఆ తర్వాత క్లబ్ యజమాని వివేక నటనను గమనించి ప్రముఖ తమిళ దర్శకుడు కె బాల చందర్ దగ్గర పరిచయం చేశాడు. అలా బాల చందర్ దగ్గర వివేక్ కొన్ని సినిమాలకు స్క్రిప్ట్ రైటర్ గా తన సినీ కెరీర్ మొదలు పెట్టాడు.

ఒకరోజు బాలచందర్ దర్శకత్వం వహించిన "మనదిల్ ఉరుది వెండుమ్" అనే సినిమాకు సంబంధించి ఒకే ఒక్క సందర్భం చెప్పి పదహారు పాత్రలను కలిగిన కథ రాయమన్నాడట. వివేక్ కేవలం ఒక్క రాత్రిలోనే కథ రెఢీ చేశారట. అంత నిబద్దత పని అంటే వివేక్ కి, అలా అదే  సినిమాలే మొదటిసారి నటించే అవకాశాన్ని పొందాడు వివేక్.  అప్పటి నుండి అడపా దడపా సినిమాలు చేస్తూ వచ్చినా ఏవీ సరైన గుర్తింపును తీసుకురాలేకపోయాయి.  ఆ తర్వాత 2003 లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ చిత్రంలో నటించడం ద్వారా అందరికీ వివేక్ గురించి తెలిసింది. ముఖ్యంగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది.

ఈయనకు సమాజ సేవ అంటే కూడా చాలా బాధ్యత ఉండేది. 2011 లో గ్లోబల్ వార్మింగ్ కు వ్యతిరేకంగా కోటి మొక్కలు  నాటాలని అనుకున్నాడు. దీనికి  గ్రీన్ గ్లోబ్ అనే పేరు పెట్టారు. కానీ వివేక్ 33.23 లక్షల మొక్కలు నాటడం మరియు ఇతరుల దగ్గర  నాటించాడు.  ప్రమాదకరమైన కరోనా వైరస్ సమయంలోనూ  అందరికీ దాని పట్ల అవగాహన కల్పించారు. వ్యాక్సిన్ అవసరాన్ని కూడా తెలియాచేశాడు.  ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలతో వివేక్ ప్రజలకు కూడా బాగా దగ్గరయ్యాడు. అలా వివేక్ హృదయ సంబంధిత వ్యాధితో హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ మరణించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: