కాణిపాకం వరసిద్ధి వినాయకుడు.. తెలుగు రాష్ట్రాల్లోనే ప్రత్యేకమైన దైవం.. ఈయన్ను ప్రమాణాల దేవుడు అని కూడా ముద్దుగా పిలుచుకుంటుంటారు. ఎవరైనా సరే అబద్దం చెబుతుంటే.. ఇక్కడ ప్రమాణం చేసి రుజువు చేసుకోమని సవాల్ విసురుతారు.

 

 

ఈ దైవానికి అంత మహత్యం ఉందని భక్తులు నమ్ముతారు. ఇప్పుడు ఈ దేవాలయానికి మహర్దశ పట్టనుంది. ఈ దేవస్థానం రథానికి బంగారు పూత వేసేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం 15 కిలోల బంగారం ఉపయోగించాల్సి వస్తుందని నిర్ణయించారు. ఈ మొత్తం బంగారాన్ని ఖర్చు ప్రాతిపదికన చెల్లించేలా తితిదేకు అనుమతి మంజూరు చేస్తూ దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

 

 

దీనిపై తదుపరి కార్యాచరణ ప్రారంభిచాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ పని పూర్తయితే కాణిపాక వరసిద్ధి వినాయక ఆలయానికి స్వర్ణ శోభ వస్తుంది. భక్తులకు ప్రత్యేక ఆకర్షణ అయ్యే అవకాశం ఉంది. కాణిపాకం చిత్తూరు జిల్లాలోనే ఉంది. ఈ జిల్లాలోనే తిరుపతితో పాటు శ్రీకాళహస్తి కూడా ఉండటంతో.. తిరుపతి వచ్చినవారు ఈ కాణిపాకం వినాయకుడిని కూడా దర్శించుకుంటుంటారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: