మాములుగా కొంతమందికి మన ఆచరిస్తూ వస్తున్న సంప్రదాయాలపై కొన్ని అనుమానాలు ఉంటాయి. వాటికి సమాధానాలు చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే అనాదిగా వస్తున్న భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కారణాలు ఏమైనప్పటికీ ఇప్పటికీ మనము పాటిస్తూ వస్తున్నాము. ఇటువంటి మన ఆచార వ్యవహారాల్లో ఎన్నో రహస్యాలు మరియు తెలియని విషయాలు దాగి ఉన్నాయి. మనిషి పుట్టక ముందు నుండి ఈ ఆచార వ్యవహారాలను మనపై ఉపయోగిస్తున్నారు. మానవుడు తల్లి గర్భం లో ఉన్నప్పటి నుండి అంటే శ్రీమంతం కార్యం మొదలు...మరణం వరకు ఎన్నో ఆచార బద్ధమైన ఎన్నో కార్యాలను జరుపుతారు.

ఈ విధంగా ఎన్నో కార్యాలు జరుగుతున్నా దేవునికి మనం పుట్టు వెంట్రుకలు ఎందుకు ఇస్తామని విషయం మీకు అందరికీ తెలియకపోవచ్చు. దీనికి గల కారణాలను ఒకసారి చూస్తే...వాస్తవంగా చూస్తే దేవునికి తల నీలాలను ఇవ్వడం అనేది పూర్వం నుండి వస్తున్న గొప్ప సంప్రదాయం. తిరుమల దేవునికి కల్యాణ కట్టలో భక్తులు తల వెంట్రుకలను సమ్పరిస్తారు. మన తల వెంట్రుకలను మన పెద్ద వారు పాపాలకు ప్రతిరూపాలుగా చెప్పేవారు, కాబట్టి తల నీలాలను ఇవ్వడం ద్వారా మన పాపాలను పోగొట్టుకోవడమే అంటున్నారు. గర్భంలో వున్న శిశువు తన తల ద్వారా భూమిపైకి వస్తాడు.

శిశువుకున్న తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక విషయ వాసన వలన పాపాలు అనేవి తల జుట్టుకు అట్టిపెట్టుకుని వుంటాయి.  కాబట్టి చిన్న వయసులోనే వారికి కేశ ఖండన కార్యక్రమాన్ని జరుపుతారు. శిశువు పుట్టిన సంవత్సరంలోపు మొట్ట మొదటి సారిగా పుట్టు వెంట్రుకలు దేవునికి సమర్పిస్తాము. మనము మన జన్మకు కారణమయిన భగవంతునికి శిరస్సును అర్పించడం వీలు పడదు కాబట్టి, శిరోజాలను ఇస్తామని కూడా చెబుతూ ఉంటారు.  శిశువు జాతక బలంం ఆధారంగా శాస్త్ర సూచిత నియమాలకు అనుగుణంగా సరైన ముహూర్తం ఎప్పుడు వస్తుందో అప్పుడే చేయాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: