వెలుగు వేడి లేవనీ, వాటికి కారకుడైన సూర్యుడు లేడనీ ఎవరూ అనలేదు. జాతి మత బేధాలు లేకుండా అన్ని విశ్వాసాలకు సిద్ధాంతాలకు అతీతంగా అందరికీ అందరి అనుభవంలోనూ ఉన్నవాడు సూర్యుడు. ఆయన ప్రత్యక్ష దైవానికి సాక్షి జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాల నియమానికి, ఆరోగ్యానికి, వికాసానికి అన్నిటికి మూలం సూర్యుడే. సూర్యుడు లేకపోతే జగత్తు ఉండడం కూడా సాధ్యం కాదు. ప్రత్యక్ష నారాయణుడు సూర్యుని భక్త కృతజ్ఞతా పూర్వకంగా ఆరాధించే సంప్రదాయం ప్రపంచం అంతటా ఉంది. అంతటి ప్రాముఖ్యత ఉన్న సూర్యుడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జీవుల ఉనికికి, మనుగడకు ఆధారం సూర్యుడు కనుక అందులో ఆశ్చర్యమేమీ లేదు సూర్యుడు దక్షిణాయణం ముగించుకుని ఉత్తరాయణం ప్రారంభించడానికి సూచనగా రెండు పర్వదినాలను మనం జరుపుకుంటున్నాం. ఒకటి సంక్రాంతి. రెండవది రథసప్తమి.  సూర్యుడు జన్మతిథి మాఘ శుద్ధ సప్తమి రథసప్తమి సంబంధమైన పర్వదినాలలో ముఖ్యమైనది.  

విధినిర్వహణలో కూడా సూర్యుడే అందరికీ ఆదర్శం ఉదయాస్తమయాలలో ఎప్పుడూ వేళను అతిక్రమించడం, విద్యార్థులకు ఆయన మూలపురుషుడు. సూర్యుని వల్లనే సంపద కలుగుతుంది అనడానికి ఎన్నో పురాణకథలు ప్రచారంలో ఉన్నాయి. అరణ్యవాస సమయంలో తమవెంట వచ్చిన పౌరులకు మునులకు ఆహారం కల్పించడం ఎలాగో తెలియక ధర్మ రాజు సూర్యుని ప్రార్థిస్తాడు. శివుడు ప్రసన్నుడై ఆయనకు ఒక అక్షయపాత్రను ప్రసాదిస్తాడు. అక్షయపాత్ర అక్షయంగా ఆహార పదార్థాలను అందిస్తుంది. అలాగే సత్రజిత్తు అనేరాజు సూర్యుని ప్రార్థించి శమంతకమణి పొందుతాడు. ఆ మణి రోజూ పుష్కలంగా బంగారాన్ని ప్రసాదిస్తుంది.
 

పుట్టుక పోషణకు అవసరమైన వన్నీ సూర్యుని ద్వారా లభిస్తున్నాయి. మన కర్మలను మనస్సు నియంత్రిస్తే ఆ మనసు నియంత్రించేవాడు చంద్రుడు. చంద్రుడిని నియంత్రించే వాడు సూర్యుడు. ఆధ్యాత్మిక సాధనలో ప్రధాన సాధనం మనస్సే. అంతటికీ అన్నింటికి కారకుడైన సూర్యుని ఆరాధించి ఎందరో ఋషులు, యోగులు అద్భుత ఫలితాలను పొందారు సూర్య యోగం పేరుతో ఆధ్యాత్మిక ప్రక్రియ నొకదానిని రూపకల్పన చేసి అందించారు. సూర్యుడి సూర్యకాంతి జ్ఞానమని చెబుతారు. శరీరంలో 24 తత్వాలు ఉంటాయి.

సూర్య కాంతి ప్రసారంతో వీటిని మేలుకొలిపి చైతన్యవంతం చేస్తే జ్ఞానం సిద్ధిస్తుందని వీరంటారు. పంచ భూతాలలో ఆకాశం, అగ్ని ఉన్నాయి. ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతోంది. అగ్ని వల్ల వెలుగు వేడి పుడుతున్నాయి. మనుషులు యోగులు ఎంతో కాలం పాటు నిరాహారంగా ఉండి తపస్సు చేసుకుంటూ ఉంటారని మనకు తెలుసు. ఇది సాధ్యమా అని సందేహించే వాళ్ళు ఉంటారు. ఆ ప్రకృతిలోని భాగమైన మనము వాటి ప్రక్రియల గురించి తెలుసుకున్నప్పుడు ఈ సందేహానికి అవకాశముండదు. సూర్య నమస్కారాలు కలలు ఆసనాల వల్ల సూర్య శక్తిని నేరుగా స్వీకరించినప్పుడు ఆ సూర్యశక్తి మనలోని శక్తులకు అనూహ్యమైన పరివర్తన కల్పిస్తుంది.


శరీర ప్రాణ మనస్సులను మూడింటినీ విశ్వ చైతన్యంలోకి ప్రవేశపెడుతుంది. మనలో అంతర్గతంగా ఉన్న శక్తి కేంద్రాలు తెలుసుకున్నప్పుడు శరీరం నిలుపుకోవడానికి బాహ్యమైన ఆహారపదార్థాల అవసరం తగ్గుతుంది. శాంతి సమస్థితి కలుగుతాయి. సూర్యకిరణాలు ఏడు రంగులలో ఉంటాయని మనకు తెలుసు. దీని ఆధారంగా ఒక చికిత్సా పద్ధతిని కనిపెట్టారు. వేడిని కలిగించి సంబంధమైన రుగ్మతలను నివారిస్తుంది. కీళ్ళ నొప్పులు వంటి రుగ్మతలను పోగొడుతుంది. ఈ మూడు ప్రధాన కారణాలుగా స్వీకరించి మిగిలిన రెండు మూడు వర్గాలుగా విభజించి చికిత్సకు ఉపయోగిస్తారు. నమస్కారాలు మొదలైన వాటి వల్ల సూర్యకిరణాలు మన ఆలోచనా ప్రక్రియ శుద్ధిచేసి తగువిధంగా నియంత్రిస్తూ ఉంటాయి. నియంత్రణకు లొంగని మనస్సు సౌరవ్యవస్థ నుంచి వచ్చే ఫోటాన్ల సహాయంతో తేలికగా అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: