పురాతన కాలం నుండి మనం చూసుకున్నట్లైతే  ఋషులు మరియు ఇతర భక్తులు తమ పూజల సమయంలో  ఎక్కువుగా దేవుళ్లకు అదే విధంగా  దేవతలకు పువ్వులు అర్పిస్తారు.  ఏ పూజ చేసినా సరే ఖచ్చితంగా పువ్వులు ఉండాలి.  పూజలో పువ్వుల ప్రాముఖ్యత అందరికి తెలుసు. చాలా దేవుళ్ళ పటాలల్లో  దేవుళ్ళు మరియు దేవతలు పువ్వులను పట్టుకుని ఉంటారు.  ఉదాహరణకు, లక్ష్మీ దేవి చేతిలో కమలం పువ్వు ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో మనం చూడవచ్చు.  ఇది దేవుళ్లను మరియు దేవతలను సంతోషంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది అంటున్నారు పండితులు.
 

సాధారణంగా ప్రతి ఒక్కరికి ఒక బిగ్ డౌట్ ఉంటుంది . మనం దేవుడి పటాలకు పూలు పెడతాం . కానీ ఆ తర్వాత పూలు ఎండిపోయిన తర్వాత చాలామంది వాటిని చెత్తబుట్టలో వేస్తూ ఉంటారు.  కానీ అలా చేయకూడదు మహా మహా పాపం.  దేవుడికి సంబంధించి ఏ పని చేసినా సరే చాలా పవిత్రంగా ఉండాలి . అయితే దేవుడికి పెట్టిన పూలను పూజకు వాడిన పూలను ఏం చేయాలి..? పూజ అనంతరం ఆ పూల ను ఎక్కడ వేయాలి ..? అనేది అందరికీ ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ . పూజకు వాడిన పూలను ఆ తర్వాత ఏం చేయాలి..?? అనే విషయం ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!


చాలా మంది ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుడికి పూజలు చేస్తారు. పూజలో ఉపయోగించిన పూలు..లేదా దేవుడి పటాలకి పెట్టిన పూలను చాలా పవిత్రంగా భావించాలి. వీటిని పూజ తర్వాత ఎలా తీసివేయాలి అన్నది హిందూ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యమైన విషయం. పండితులు చెప్పిన విధానం ప్రకారం.. పూజకు వాడిన పూలు ఆ తర్వాత .. పూలను చెత్తలో వేయకూడదు. ఇవి దేవుడికి సమర్పించిన పవిత్రమైన వస్తువులుగా భావించాలి.



పూలను చెరువు, నదుల్లో వదలడం మంచిది. సాంప్రదాయంగా పూలను శుద్ధమైన నీటిలో వేసి ఆ నీటిని చెట్టుకు పోయడం, లేదా తోటలో వదిలేయడం ఇంకా ఇంకా ఉత్తమం. కొందరు పూలను ఎరువుగా కూడా ఇంట్లో కాంపోసిట్ గా ఈ పూలను అక్కడ వేసి ఎరువుగా ఉపయోగించవచ్చు. ఇది సృష్టికి సహజమైన మార్గం. మరికొందరు పూలను పచ్చని చెట్టుల్లో వదులుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: