వినాయక చవితి అంటే చాలామందికి ఇష్టమైన పండుగ..ముఖ్యంగా చిన్నపిల్లల నుండి మొదలు పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు తొమ్మిది రోజుల పాటు వినాయకున్ని ఎంతో భక్తిశ్రద్ధలతో నిష్టగా పూజిస్తూ ఉంటారు. ఇక చిన్న పిల్లలకైతే వినాయక చవితి అంటే ఒక ఎమోషన్ అని చెప్పుకోవచ్చు. తొమ్మిదవ రోజు విగ్రహాన్ని నిమజ్జనం చేసిన సమయంలో చిన్న పిల్లల ఏడుపులు చూడాలి చాలా బాధేస్తుంది. ఇదంతా పక్కన పెడితే వినాయక చవితి సందర్భంగా విద్యార్థులు ఈ పనులు చేస్తే చదువుల్లో విజయాలు సాధిస్తారని కొంతమంది పండితులు అంటున్నారు. మరి వినాయక చవితి రోజు విద్యార్థులు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వినాయక చవితి రోజు ఉదయాన్నే లేచి స్నానం ఆచరించి ఇంట్లో ఉండే వినాయక చిత్రపటం ముందు కూర్చుని ఆయన ఆశీర్వాదాలు తీసుకొని వినాయకుడికి కుంకుమ బొట్టు పెట్టి ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు ఉచ్చరించాలి. ఈ మంత్రం పటించినప్పుడు మధ్యలో లేవకూడదు ఏకాగ్రతతో పఠించాలి.ఆ తర్వాత గణేశుడికి 21 గరికపోచలను సమర్పించి గణేశుడికి ఇష్టమైనటువంటి నైవేద్యం మోదకం సమర్పించి ఏకాగ్రతతో పూజ చేయాలి. వినాయక చవితి అత్యంత పవిత్రమైన రోజు కాబట్టి ఆ రోజు వినాయక అథర్వ శీర్షం పటించాలి. ఇలా వినాయక చవితి రోజు నిష్టగా ఆ వినాయకున్ని పూజిస్తే ఏకాగ్రత పెరిగి చదువుపై విద్యార్థులకు ఆసక్తి పెరుగుతుందని పండితులు అంటున్నారు.
అంతేకాదు విద్యార్థులు కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి అని అంటున్నారు. అలాగే ఏదైనా పని చేసే ముందు విఘ్నాలు రాకుండా విఘ్నాలు తొలగిపోవాలని విగ్నేషున్ని పూజిస్తారు. అలాగే విద్యార్థులు చదువుకునే ముందు కూడా మొదట విగ్నేషున్ని తలుచుకొని చదువుకోవడం ప్రారంభిస్తే ఏకాగ్రతతో చదువుతారని, ఇలాంటి విద్యార్థుల్లో మేధాశక్తి పెరిగి జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది అని పండితులు అంటున్నారు. మరి విద్యార్థులు ఈ వినాయక చవితికి ఒకసారి ఈ పద్ధతి ఫాలో అయ్యి చదువు మీద దృష్టి పెట్టండి ఫలితం ఎలా ఉంటుందో చూడండి..
మరింత సమాచారం తెలుసుకోండి: