ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అంత సులువైన క్యాచ్ వదిలేస్తాడని అనుకోలేదంటూ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఆశ్చర్యపోయాడు. వాషింగ్టన్ సుందర్‌ వేసిన ఇన్నింగ్స్ 175వ ఓవర్‌లో డామ్ బెస్‌ (28*) క్యాచ్ ను రోహిత్ వదిలేశాడు. సుందర్‌ వేసిన బంతిని మిడ్‌ వికెట్‌ వైపుగా బెస్ కొట్టబోయాడు. అయితే ఆ బంతి నేరుగా రోహిత్ చేతుల్లోకి వెళ్ళింది. కానీ ఎంతో సులువైన ఆ క్యాచ్‌ను హిట్‌మ్యన్‌ అందుకోలేకపోయాడు. దీంతో రోహిత్‌తో సహా టీమిండియా ఆటగాళ్లంతా నిరాశ చెందారు. ఇదే సమయంలో రోహిత్ వదిలిన క్యాచ్ చూసి ఇంగ్లీష్ డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్న స్టోక్స్‌ కూడా షాక్ తిన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.


19 పరుగుల వద్ద రోహిత్ పుణ్యమా అని లైఫ్ దక్కించుకున్న బెస్‌.. శనివారం ఆట ముగిసే వరకు క్రీజులో నిలిచాడు. బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును 550 దాటించాడు. 

ఇదిలా ఉంటే చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా దారుణంగా ఆడుతోంది. ముఖ్యంగా ఫీల్డింగ్ లో టీమిండియా ఆటగాళ్లు పోటీపడి మరీ ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ ఇచ్చిన క్యాచ్ లను జారా విడిచారు. పంత్ తో మొదలైన డ్రాప్ క్యాచ్ పరంపరను ఆ తర్వాత అశ్విన్‌, పుజారా, రోహిత్ కూడా కొనసాగించారు. తలా ఓ క్యాచ్ వదిలి పెట్టారు. దీంతో మొత్తం నాలుగు సార్లు ఇంగ్లీష్ బ్యాట్స్ మన్ కు జీవనదానం లభించింది.


టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టు, మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 578 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇంగ్లీష్ కెప్టెన్ జో రూట్ 218 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడితో పాటు ఓపెనర్ సిబ్లీ 87, స్టోక్స్ 82 రాణించారు. దీంతో ఇంగ్లాండ్ 578 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ప్రారంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. రోహిత్ శర్మ 6 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. ఇక మరో ఓపెనర్ గిల్ కూడా 29 పరుగులు చేశాడు. ఇక ఆ తర్వాత రహానే(1), కెప్టెన్ కోహ్లీ(11) కూడా నిరాసపరిచారు. అయితే పుజారా(73) పంత్(91) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే పుజారా అవుట్ తర్వాత పంత్ వేగంగా ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ 91 పరుగుల వద్ద అవుతాయి మరోసారి సెంచరీ మిస్ చేసుకున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: