ప్రస్తుతం టీమిండియా మహిళల జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే.  ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా మహిళల జట్టు వన్డే టి20 సిరీస్ లు ఆడుతుంది టీమిండియా.  ఈ క్రమంలోనే మొదటి వన్డే సిరీస్ జరిగింది. ఇక ఈ వన్ డే సిరీస్లో అద్భుతంగా టీమిండియా రాణిస్తుంది అని అనుకున్నప్పటికీ చివరకు నిరాశ మిగిల్చింది.  బ్యాటింగ్లో బౌలింగ్ లో పేలవ ప్రదర్శన కారణంగా ఇక చివరికి టీమిండియా ఓటమి చవిచూడాల్సి పరిస్థితి వచ్చింది. అద్భుతంగా రాణించిన ఇంగ్లాండ్ జట్టు వన్డే సిరీస్ కైవసం చేసుకుంది.  అయితే ప్రస్తుతం ఇంగ్లండ్ లో టి20 సిరీస్ ఆడుతుంది టీమిండియా జట్టు.



 ఇక టి20 సిరీస్ లో అయినా టీమిండియా జట్టు పుంజుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా మొదటి మ్యాచ్ ఓటమిపాలు అయింది టీమిండియా మహిళల జట్టు. దీంతో ఇక మరో మ్యాచ్ గెలిస్తే చాలు ఇక ఇంగ్లాండ్ జట్టు సిరీస్ కైవసం చేసుకుంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇక రెండో టీ20 మ్యాచ్ లో మాత్రం ఊహించని విధంగా అద్భుత విజయాన్ని సాధించింది టీమిండియా. రెండవ టీ 20 మ్యాచ్ జరిగిన సమయంలో భారత మహిళా క్రికెట్ ప్లేయర్ ఇక బౌండరీ దగ్గర ఎంతో అద్భుతమైన క్యాచ్ అందుకుని అందర్నీ ఫిదా చేసింది. క్రికెట్ ప్రపంచం మొత్తం భారత క్రికెట్ మహిళా ప్లేయర్ డియోల్ అందుకున్న క్యాచ్ తో అవాక్కయ్యారు.



 అయితే ఇక నేడు భారత్ ఇంగ్లాండ్ మధ్య మూడవ టి20 మ్యాచ్ జరుగుతుంది అనే విషయం తెలిసిందే. ఈ టి 20 మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. ఎవరు విజయం సాధిస్తే వారు సిరీస్ కైవసం సిరీస్ కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ఇరు జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ జరిగింది.  అయితే ఇటీవలే భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టి20 సిరీస్ లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.  సాధారణంగా ఎంతో మంది ఆటగాళ్లు ఇక బౌండరీ దగ్గర బంతిని ఆపి పరుగులను సేవ్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు.  ఇక్కడ ఓ మహిళా క్రికెటర్ కూడా ఇలా పరుగులను కట్టడి చేయాలని   ప్రయత్నించింది . కాని చివరికి తన చేతులతో స్వయంగా బాల్ ని బౌండరీ బయటకి నేట్టసింది. ఇది కాస్తా సంచలనంగా మారిపోయింది. దీనికి సంబంధించిన వీడియో కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: