సాధారణంగా మ్యాచ్ ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిపోతున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు అంపైర్లు ఆటగాళ్ళ మధ్య చిన్నపాటి వివాదం చోటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇలాంటి వివాదాలు జరిగినప్పుడు ఆటగాళ్లలో ఎంత కోపంలో ఉన్నప్పటికీ కాస్త మర్యాదగానే మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడ బూతులు తిట్టడం లాంటివి చేయరు. కానీ ఇటీవలే ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ జరుగుతుండగా ఇక ఇందులో పాల్గొన్న  ప్రపంచ నెంబర్ 2 డానీల్ మెద్వదేవ్ అంపైర్ను బూతులు తిట్టాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా ప్రపంచ నెంబర్ 2 ఆటగాడు ఇలా ఎంపైర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటి అందరూ అవాక్కయ్యారు.


 ఎంత స్టార్ ప్లేయర్ అయితే మాత్రం తనని తాను కంట్రోల్ చేసుకోవాలి కదా అంటూ సోషల్ మీడియా వేదికగా ఎన్నో కామెంట్లు కూడా పెట్టారు. ఇలా  మెద్వదేవ్ అంపైర్ పై  బూతుపురాణం వదలడం సంచలనం గానే మారిపోయింది అని చెప్పాలి. ఇక క్రీడా స్పూర్తికి విరుద్ధంగా డానిల్ మెద్వదేవ్ వ్యవహరించడంపై  ఎంతోమంది ఆగ్రహం వ్యక్తం చేయగా.. అంపైర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను భారీ జరిమానా విధించారు టోర్నీ నిర్వాహకులు. క్రీడ స్ఫూర్తికి విరుద్ధంగా అతడు ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఏకంగా 12 వేల యూఎస్ డాలర్లు జరిమానా విధిస్తున్నట్లు పేర్కొన్నారు నిర్వాహకులు.



 కాగా కీలకమైన సెమీస్ మ్యాచ్లో ప్రత్యర్థి ఆటగాడు రూల్స్ కి  విరుద్ధంగా స్టాండ్స్ లో ఉన్న తన తండ్రి నుంచి కొన్ని సలహాలు తీసుకున్నాడు. ఇక ఇదే విషయాన్ని గమనించి  ఎంపైర్   దగ్గరికి వెళ్ళాడు డానీల్ మెద్వదేవ్.   నువ్వు ఏమైనా స్టుపిడ్ వా.. అతను తండ్రి దగ్గర నుంచి సలహాలు తీసుకుని రూల్స్ బ్రేక్ చేస్తుంటే చూస్తూ ఊరుకున్నావ్.. నాతో మాట్లాడు నీకు వినిపిస్తుందా లేదా నీలాంటి చెత్త అంపైర్ ను ఇప్పటి వరకు చూడలేదు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసాడు.   అయితే మ్యాచ్ అనంతరం రియలైజ్ అయిన డానీల్ మెద్వదేవ్ అంపైర్ దగ్గరికి వచ్చి క్షమాపణ కోరాడు  అయినప్పటికి నిర్వాహకులు మాత్రం అతనిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కీలకమైన సెమీస్ మ్యాచ్లో  మెద్వదేవ్  విజయం సాధించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: