ఈ క్రమంలోనే ఇక సంజు శాంసన్ కెప్టెన్సీలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడగా రెండు మ్యాచ్లలో విజయం సాధించి ఇక ఎక్కువ రన్ రేట్ తో అగ్రస్థానంలో కొనసాగుతోంది రాజస్థాన్ రాయల్స్. అయితే చాలా ఏళ్ళ తర్వాత ఇలా రాజస్థాన్ అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది అని చెప్పాలి.అయితే ఇలా ఎంతో దూకుడు మీదున్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఇక ఇప్పుడు ఊహించని షాక్ తగిలింది అని తెలుస్తోంది. జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న స్టార్ బౌలర్ గాయం కారణంగా ఐపీఎల్ సీజన్ కి మొత్తం దూరం కాబోతున్నాడు.
రాజస్థాన్ రాయల్స్ జట్టులో నాథన్ కౌల్టర్ నిల్ కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అయితే ఇటీవలే గాయం బారినపడిన ఈ స్టార్ బౌలర్ ఇక ఈ సీజన్ మొత్తానికి కూడా దూరం కాబోతున్నాడు అనే విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది అని చెప్పాలి. సన్ రైజర్స్ హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో బౌలింగ్ చేస్తున్న సమయంలో నాథన్ కాలికి గాయమైంది. అయితే ఇప్పుడు గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతని నెలకు పైగానే రెస్ట్ అవసరమని వైద్యులు చెబుతున్నారు. దీంతో పూర్తి ఐపీఎల్కు దూరంగా కాబోతున్నాడట. ఈ స్టార్ బౌలర్ ఇప్పుడు ఆస్ట్రేలియా కు ప్రయాణం అయ్యాడు అని తెలుస్తోంది..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి