ఐపీఎల్ లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్ జట్టు ఒక్క మ్యాచ్ మినహా మిగతా అన్ని మ్యాచ్ లలో కూడా విజయం సాధించింది అని చెప్పాలి. అటు చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఐదు మ్యాచ్లలో కేవలం ఒకే ఒక మ్యాచ్లో గెలిచి క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఈ క్రమంలోనే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఉత్కంఠగా మారిపోయింది. అయితే చివరికి గుజరాత్ టైటాన్స్ జట్టు మరోసారి విజయాన్ని సాధించి సత్తా చాటింది. హార్దిక్ పాండ్యా అందుబాటులో లేకపోయినప్పటికీ రషీద్ ఖాన్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన గుజరాత్ జట్టు విజయఢంకా మోగించింది.
గుజరాత్ జట్టు విజయం సాధించినప్పటికీ అటు అదే జట్టు బౌలర్ ఫెర్గ్యూసన్ మాత్రం ఒక చెత్త రికార్డును నమోదు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో నాలుగు ఓవర్లలో 46 పరుగులు సమర్పించుకున్నాడు. అంతేకాదండోయ్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇంతకుముందు 2020 ఐపీఎల్ సీజన్ లో నాలుగు ఓవర్లలో 54 పరుగులు, 2021 ఐపీఎల్ సీజన్ లో నాలుగు ఓవర్లు 56 పరుగులు ఇచ్చాడు. ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో కూడా చెత్త బౌలింగ్ వేసాడు. అంతకుముందు సన్రైజర్స్ లో జరిగిన మ్యాచ్ లో కూడా 46 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయలేదు దీంతో వరుస విజయాలతో దూసుకుపోతున్న గుజరాత్ అతని పక్కన పెడితే బెటర్ అని అభిమానులు సలహా ఇస్తూ ఉండడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి