ఒకప్పుడు సైబరాబాద్ సిపి గా ఉన్న సజ్జనార్ నేరస్తుల గుండెలో గుబులు పుట్టించారు అన్న విషయం తెలిసిందే. ఇక ఆడపిల్లలపై ఎవరైనా వేధింపులకు పాల్పడే వారి పట్ల మరింత కఠినంగా వ్యవహరించారు. హైదరాబాద్ నగరంలో జరిగిన దిశ అత్యాచారం హత్య తర్వాత నిందితులను ఎన్ కౌంటర్ చేయడం కేవలం సీపీ సజ్జనార్ తోనే సాధ్యం అయింది అని చెప్పాలి. అలాంటి సీపీ సజ్జనార్ ఇటీవలే తెలంగాణ ఆర్టీసీ ఎండీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏకంగా ఆ పదవికే అలంకరణం గా మారిపోయారు అని చెప్పాలి.  ప్రయాణికుల సౌకర్యార్థం ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.


 ఇప్పటివరకు అటు టీఎస్ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ తీసుకున్న నిర్ణయాలు సంచలనం సృష్టించాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు విద్యార్థులు ఎక్కడ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మరో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు సజ్జనార్. విద్యార్థులందరూ మరికొన్ని రోజుల్లో పదవతరగతి పరీక్షలు రాయబోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ పరీక్షల విషయంలో కూడా నిమిషం నిబంధన అమలులో ఉండనుంది   ఈ క్రమంలోనే నిమిషం ఆలస్యమైనా కూడా  పరీక్షకు అనుమతించే అవకాశం లేదు. ఈ క్రమంలోనే విద్యార్థులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్నారు సజ్జనార్.


 పదవతరగతి పరీక్షలు రాసే విద్యార్థులు అందరికీ ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు ఇటీవల సోషల్ మీడియా వేదికగా తెలిపారు టిఎస్ ఆర్టిసి ఎండి సజ్జనార్. ఇక ప్రస్తుతం విద్యార్థులు కలిగి ఉన్న బస్సు వాలిడిటీ జూన్ 1వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక విద్యార్థులు తమ బస్ పాస్ తోపాటు హాల్ టికెట్  చూపించి పరీక్షలు ఉన్న రోజుల్లో ఇంటి నుంచి పరీక్షా కేంద్రానికి వెళ్లడం ఇక పరీక్షా కేంద్రం నుంచి తిరుగు ప్రయాణం కావడం లాంటివి చేయవచ్చు అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: