ఐపిఎల్ ప్లే ఆప్స్ లో ప్రస్తుతం గుజరాత్ మరియు లక్నో లు మొదటి రెండు స్థానాలలో ఉన్నారు. ఇక మిగిలిన రెండు స్థానాల కోసం మూడు జట్లు పోటీ పడుతున్నాయి. ఈ రోజు రేపు జరగబోయే రెండు మ్యాచ్ ల  ఫలితాన్ని బట్టి మిగిలిన రెండు జట్లు ఖరారు అవుతాయి. అందులో భాగంగా ఈ రోజు చెన్నై రాజస్థాన్ లు, రేపు ముంబై ఢిల్లీలు తలపడుతాయి. రేపు జరగనున్న ఢిల్లీ ముంబై మ్యాచ్ పై బెంగళూర్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తోంది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఓడితే బెంగళూరు ప్లే ఆఫ్ కు వెళుతుంది. ఒకవేళ ఢిల్లీ గెలిస్తే బెంగళూర్ కు మరోసారి నిరాశ తప్పదు. దీనితో ఈ మ్యాచ్ కి ఎక్కువ ప్రాముఖ్యత దక్కింది అని చెప్పాలి.

అయితే ఈ సీజన్ మొత్తం సరైన ప్రదర్శన కనబరచని ముంబై ఇండియన్స్ ఆఖరి మ్యాచ్ లో అయినా విన్ అవుతుందా అన్నది ప్రశ్నగా మిగిలింది. ఈ సీజన్ లో ముంబై ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే... బౌలింగ్ వీరికి తీరని లోటు అని చెప్పాలి. బుమ్రా ఫామ్ లో లేకపోవడం బిగ్గెస్ట్ మైనస్... ఇక మిస్టరీ స్పిన్నర్ ఎవ్వరూ లేకపోవడం ఆందోళన కలిగించే విషయం. అంతే కాకుండా బ్యాటింగ్ లో మిడిల్ ఆర్డర్ మరియు ఫినిషింగ్ లో సమస్యలు ఉన్నాయి. ఇన్ని ప్రతికూలతల మధ్యన ముంబై ఢిల్లీ ని ఢీ కొడుతుంది.

ఈ మ్యాచ్ లో ముంబై చెలరేగి ఢిల్లీ కి షాక్ ఇస్తుందా లేదా ఎప్పటి లాగే సరైన ప్రదర్శన చేయకుండా బెంగళూర్ కు ప్లే ఆఫ్ అవకాశాన్ని దూరం చేస్తుందా అన్నది చూడాల్సి ఉంది. కాగా ఇప్పుడు బెంగుళూరు ఫ్యాన్స్ ముంబై గెలవాలని కోరుకుంటున్నారు.  అపుడే బెంగళూరు కి లైన్ క్లియర్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: