ఇటీవల ఐపీఎల్ లో భాగంగా జరిగిన కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించడానికి కేవలం ఆ జట్టు ప్రదర్శన మాత్రమే కారణమా అంటే.. ఆ జట్టు ఆటగాళ్ల ప్రదర్శన ఎంత కారణమో.. అటు లక్నో చేసిన తప్పిదాలు కూడా బెంగళూరు విజయానికి అంతే కారణం అని చెప్పాలి. ఎందుకంటే అటు అత్యుత్తమ ఫీల్డర్లు అని పేరు సంపాదించుకున్న వారు సైతం విలువైన క్యాచ్ లను వదిలేయడం అటు బెంగళూరు జట్టుకు ఎంతో కలిసి వచ్చింది.


 ఒకవేళ లక్నో ఫీల్డర్లు అన్ని క్యాచ్ లను సమర్థవంతంగా ఒడిసి పట్టుకుని ఉంటే అటు బెంగళూరు జట్టుకు కాస్త కష్ట సమయం వచ్చేది అని చెప్పాలి. ఎందుకంటే కీలకమైన బ్యాట్స్మెన్ లు పెవిలియన్ చేరేవారు. ఎన్నో కీలకమైన సింపుల్ క్యాచ్ లను కూడా నేలపాలు చేశారు లక్నో ఫీల్డర్లు.  ఇది అటు బెంగళూరుకు ఎంతగానో కలిసి వచ్చింది అని చెప్పాలి. చివరికి ఆర్సిబి చేతిలో లక్నో జట్టు 14 పరుగుల తేడాతో పరాజయం పాలు కావాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పటి వరకు ఫినిషర్ గా అద్భుతంగా రాణించిన దినేష్ కార్తీక్ ఒక క్యాచ్ ఇవ్వగా దానిని లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ జారవిడిచాడు.


డైవ్ చేసి ఎంతో అద్భుతంగా క్యాచ్ అందుకున్నట్లు  కనిపించిన కె.ఎల్.రాహుల్ చివరికి ఆ క్యాచ్ నేలపాలు చేశాడు. బెంగళూరు ఇన్నింగ్స్ 15 ఓవర్లు సమయంలో మోసిన్ ఖాన్ వేసిన బంతిని దినేష్ కార్తీక్ ఇన్ ఫీల్డ్ దాటించడానికి ప్రయత్నించారు. అయితే షాట్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో కొంచెం గాల్లోకి లేచింది. ఇక అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న  కె.ఎల్.రాహుల్ డైవ్ చేస్తూ క్యాచ్ అందుకునే ప్రయత్నం చేసి దాదాపు క్యాచ్ అందుకున్నాడు. కాని చివరిక్షణంలో బంతి చేతిలో నుంచి జారి పోయింది. ఇక్కడ డగౌట్ లో ఉన్న లక్నో మెంటార్ గౌతం గంభీర్ తీవ్రంగా నిరాశ చెందాడు. తొలుత కేఎల్ రాహుల్ క్యాచ్ అందుకున్నాడని చప్పట్లు కొట్టినా గంభీర ఆఖరి క్షణాల్లో క్యాచ్ వదలటం తల పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl